అపునరుక్త వ్యంజనము
సాహితీమిత్రులారా!
ఈ విధమైన వాటిని ఎక్కువగా సంస్కృతంలో చూడవచ్చు.
వేదాంతదేశికుల "పాదుకాసహస్రం" లో చిత్రపద్ధతి పేరున 911-950 శ్లోకాలు కూర్చబడ్డాయి.
920 వ శ్లోకం ఈరకమైన "అపునరుక్త వ్యంజనము" చిత్రరచన చేశారు.
బాఢా ఘాళీ ఝాటతుచ్ఛే గాధాభనాయపుల్లఖే
సమాధౌశఠజిచ్చూడాం వృణోషిహిపాదుకే
భావం:- ఓ భగవత్పాదుకా దృఢమైన పాపసముదాయమనే అడవిలేనట్టి, వికసించిన మనస్సుగల సమాధియోగమందు దివ్యప్రబంధాన్ని ప్రకాశింపచేయడానికి నీవు శఠగోపసూరి శిరస్సును వరిస్తున్నావు.
ఈ శ్లోకం గమనిస్తే వచ్చిన హల్లు మళ్ళీ రాలేదు కావున ఇది అపునరుక్త వ్యంజన చిత్రం
No comments:
Post a Comment