ప్రహేళిక -3
సాహితీమిత్రులారా!సమాధానాలు ప్రహేళికలోనే ఉంటే వాటిని అంతర్లాపిక అనే రకానికి చెందిన ప్రహేళికగా చెబుతారు.
అలాంటిదానికి ఉదాహరణ ఈ ప్రహేళిక కాని ఇది ఒక సమస్య దానికి కవి ఈ విధంగా ప్రహేళికలో పూరించాడు.
"ఏకాదశినాఁడు సప్త మేడు గడియల్" - అనేది సమస్య
పూరణ -
శ్రీకాంతుని దిన మెన్నడు
రాకొమరుని కెద్ది ప్రియము రథతిథి యెన్నం
డేకొలఁరి కన్నమరుగునొ
ఏకాదశినాఁడు సప్త మేడే గడియల్!
దీనిలో - శ్రీకాంతుని దిన మెన్నడు? - విష్ణుని రోజేది ?
రాకొమరునికి ఎద్ది ప్రియము? - రథతిథి యెన్నండు?-
ఏకొలఁరి కన్నమరుగునొ ? - ఏ కొలదికి (ఎంత సమయానికి) అన్నం అరుగుతుందో?- ఈ ప్రశ్నలకు సమాధానాలు చివరిపాదంలోని పదాలను విరుచుకొని చూస్తే తెలుస్తుంది.
ఏకాదశినాఁడు సప్త మేడు గడియల్ - దీనిలో ఏకాదశి, నాఁడు, సప్తమి, ఏడుగడియల్
అనే పదాలుగా విడగొట్టిన ఈ విధంగా సమాధానాలవుతాయి.
అనే పదాలుగా విడగొట్టిన ఈ విధంగా సమాధానాలవుతాయి.
శ్రీకాంతుని దిన మెన్నడు? - విష్ణుని రోజేది ? - ఏకాదశి
రాకొమరునికి ఎద్ది ప్రియము? - నాఁడు (దేశం)
రథతిథి యెన్నండు?- సప్తమి(తిథి)
రథతిథి యెన్నండు?- సప్తమి(తిథి)
ఏకొలఁరి కన్నమరుగునొ ? - ఏ కొలదికి (ఎంత సమయానికి) అన్నం అరుగుతుందో? - ఏడుగడియల్
No comments:
Post a Comment