దంష్ట్రల మీద శంకరుడు తాండవమాడెను రాముకైవడిన్
సాహితీమిత్రులారా!
కందుకూరి రుద్రకవికి ఇచ్చిన సమస్య ఇది.
"దంష్ట్రల మీద శంకరుడు తాండవమాడెను రాముకైవడిన్" - అనేదానిలో ప్రాస బిందు పూర్వక "ష్ట్ర" ఇది దుష్కర ప్రాసము. దీన్ని పూరించి పండిత ప్రశంసలకు పాత్రుడైనాడు కందుకూరి రుద్రకవి.
ఇది అంతర్లాపిక ప్రహేలికగా క్రమాలంకారంలో పూరించినాడు.
రింష్ట్రహి యేమిటన్ గరచు? ఋక్షము లెక్కడ నుండు? అంధకున్
సంష్ట్రను జేసె నే విభు? డనంతర మందతడేమి చేసెనో?
రుం ష్ట్రఖి లాత్ముడైన లవు రూప మదే గతి నుండు? చెప్పుమా?
దంష్ట్రల,మీద,శంకరుడు,తాండవమాడెను, రాము కైవడిన్
రింష్ట్రహి - కరిచే స్వభావంగల పాము, సంష్ట్రనుడు - నశించే ప్రాణాలు కలవాడు,
రుంష్ట్రఖిలాత్ముడు - రోష స్వభావుడు.
దీనిలోని మూడు పాదాలలోని ప్రశ్నలకు నాలుగవ పాదంలో జవాబులు ఉన్నాయి అందుకే ఇది అంతర్లాపి ప్రహేలిక అవుతుంది.
1. పాము దేంతో కరుస్తుంది? - దంష్ట్రలతో
2. చుక్కలెక్కడ ఉంటాయి? - మీద
3. అంధకుణ్ణి చంపినదెవరు? - శంకరుడు
4, తరువాత అతడేం చేశాడు? - తాండవము ఆడాడు
5. లవుని రూపం ఎలా ఉంటుంది? - రామునిలా
No comments:
Post a Comment