వలపుదొర టెక్కెవులఁబట్టగలుగునేది?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం
విప్పండి-
తులలేని ధనముచే తులఁదూగుతది యేది?
గిరిజామనోహరు గేహమేది?
విరివిగా తుమ్మెద విహరించు తావేది?
ఓడకంబుధి దాటుచుండు నేది?
కలకాలమొకరీతి కల్లయౌనదియేది?
శ్యామంక చీలలో జాణయేది?
దివిషద్గణము నడతెంచు మార్గంబేది?
కరివేల్పుఁగన్న మృగంబు నేది?
వలపుదొర టెక్కెములఁబట్టగలుగునేది?
పలుకుదురు లేక లెస్సగాఁజెలగదేది?
ప్రశ్నలన్నిటికిని తొలిపదములందె
ఉత్తరమగలున్నని చూచి యుల్లసిలుడు
దీనిలోని 10 ప్రశ్నలకు సమాధానాలను
చెప్పగలరేమో చూడండి
దీనిలోని ప్రశ్నలన్నిటికి పాదంలోని
మొదటి రెండక్షరాలే గమనించండి
1. తులలేని ధనముచే తులఁదూగుతది యేది - తుల
2. గిరిజామనోహరు గేహమేది - గిరి
3. విరివిగా తుమ్మెద విహరించు తావేది - విరి
4. ఓడకంబుధి దాటుచుండు నేది - ఓడ
5. కలకాలమొకరీతి కల్లయౌనదియేది - కల
6. శ్యామంక చీలలో జాణయేది - శ్యామ
7. దివిషద్గణము నడతెంచు మార్గంబేది - దివి
8. కరివేల్పుఁగన్న మృగంబు నేది - కరి
9. వలపుదొర టెక్కెములఁబట్టగలుగునేది - వల
10. పలుకుదురు లేక లెస్సగాఁజెలగదేది - పలుకు
No comments:
Post a Comment