Tuesday, August 7, 2018

పాదుకాసహస్రం


 పాదుకాసహస్రం




సాహితీమిత్రులారా!




  శ్రీ వేదాంతదేశికులవారు శతాధిక గ్రంథకర్త.వారి గ్రంథాలన్నీ కూడా విద్వద్వత్కవితా గంగాలహరీ విలసితాలు.  వాటిలో 'పాదుకా సహస్రం'అనే గ్రంథరాజం శ్రీరంగనాథులవారి పాదుకలను స్తుతిస్తూ ఆశువుగా 1008 శ్లోకాలలో ఒక్క రాత్రిలో   రచించారు. దీనికి కారణం  మరొక  ఆశుకవితో  కలిగిన  స్పర్థ మూలమని "వేదాంతాంచార్యవిజయం" అనే సంస్కృత గ్రంథంలోనూ మరికొన్ని పూర్వగ్రంథాలలోనూ ఉంది.
పాదుకాసహస్రం 32 (భాగాలు)పద్ధతులుగా రచించబడింది.
అవి-1ప్రస్తావనపద్ధతి,2సమాఖ్య,3 ప్రభావ,4.సమర్పణ, 
5ప్రతిప్రస్థాన,6అధికార పరిగ్రహ,7అభిషేక,8నిర్యాతన,
9వైతాళిక,10శృంగార,11సంచార,12పుష్ప,13పరాగ,
14నాద,15రత్నసామాన్య,16బహురత్న,17పద్మరాగ,
18ముక్తా,19మరకత,20ఇంద్రనీల,21బింబప్రతిబింబ,
22కాంచన,23శేష, 24 ద్వంద్వ,25సంనివేశ,26యంత్రికా,
27రేఖా,28సుభాషిత,29ప్రకీర్ణ,30చిత్ర,31నిర్వేద,32ఫలపద్ధతి.
    వీటిలో30 క్రమసంఖ్యగల "చిత్రపద్ధతి"లో చిత్రకవిత్వం
పుష్కలంగా ఉంది.
    చిత్రపద్ధతి 911శ్లోకం నుంచి మొదలై 950శ్లోకంతో ముగుస్తుంది.
అంటే చిత్ర పద్ధతిలోని శ్లోకాలు 40.
     సకలచిత్రాలకూ ఆస్పదమైన శ్రీరంగనాథులవారి మణీ
మయ పాదుకాదేవిని ప్రపత్తిపొందుతూ  ఈ పద్ధతిలోని 1వశ్లోకం
 ప్రారం భించబడింది.2వ శ్లోకంలో భగవంతునికన్న
పాదుకాశీలంమిన్నఅనేచిత్రప్రశంసఉంది.3వశ్లోకంగోమూత్రికా
బంధం,4వశ్లోకంలో గూఢచతుర్థం అనే శబ్దచిత్రం ఉంది.
5వశ్లోకం నిరోష్ఠ్య శబ్దచిత్రం,6క్రియాగుప్త చిత్రం, 7అకార విభక్తి చిత్రం,8పాదావృత్తియమకచిత్రం,9పాదానులోమప్రతిలోమ
ప్రతిలోమయమకచిత్రం,10 అపునరుక్తవ్యంజన చిత్రం, 11
మురజబంధచిత్రం,12అనతిరిక్త పదపదార్థానులోమ ప్రతిలోమ శబ్దచిత్రం,13 శరబంధచిత్రం,14గరుడగతి చక్రబంధచిత్రం,15ద్విశృంగాటక చక్రబంధ చిత్రం, 16ద్విచతుష్క చక్రబంధ చిత్రం,17చతురరచక్రబంధచిత్రం/
అష్టదళపద్మబంధచిత్రం,18 స కర్ణిక షోడశదళ పద్మబంధ చిత్రం,
19స్తుతి, 2౦ చతురంగ తురంగ పదబంధ చిత్రం,
21అర్ధభ్రమక యమక చిత్రం,22సర్వతోభద్రబంధచిత్రం, మళ్లీ
23సర్వతోభద్రబంధచిత్రం,24త్ర్ర్యక్షర యమక చిత్రం, 25ఏక
హల్  శ్లోకచిత్రం,26మహాయమకచిత్రం-దీనిలో గోమూత్రిక,
కంకణ,మురజ,పద్మబంధాలూ ,అనులోమప్రతిలోమగతి
చిత్రమూ,అర్ధయమక-పాదచతురావృత్తియమక పాదార్థాష్టా
వృత్తియమక-పాదషోడశవృత్తియమక-ఏకాక్షర ద్వాత్రింశత్
ఆవృత్తి యమకచిత్రాలూ ఉన్నాయి.27పాదచతుష్టయభాగా
వృత్తియమకచిత్రం,28పాదభాగ చతురావృత్తి యమకచిత్రం,
29షోడశావృత్తియమకచిత్రం, దీనిలోనే షోడశదళపద్మ బంధచిత్రం,
అష్టదళ పద్మబంధచిత్రం చతుర్దళ పద్మబంధ చిత్రం-అనేవీ  ఉన్నాయి,
30కవినామాంకిత అష్టదళపద్మ బంధచిత్రం,31 కావ్యనామాంకిత కవినామాంకిత
మహాచక్రబంధ చిత్రం,32చతురంక(అనుష్టుప్ శ్లోకగర్భిత)అష్టారచక్ర
బంధచిత్రం,33,34అనులోమగోమూత్రికాబంధచిత్రం,35,36
భిన్నవృత్తానులోమ గోమూత్రికాబంధచిత్రం, 37,38 భిన్న వృత్తానులోమ ప్రతోలోమ చిత్రం,39పాదుకాయుగళ గర్భక
ర్ణికమష్టదళ పద్భబంధచిత్రం(ఈ పాదుకాబంధం దేశికుల
వారి స్వీయ ప్రతిభా జనితం)'40 పాద ద్వయభాగ ద్వయావృత్తి యమకచిత్రం.
      కేవలనామమాత్రంగ పాదుకాసహస్రంలోని చిత్రకవితా
పరిచయం ఇది.ప్రతి చిత్రకవితనూ సలక్షణంగా సచిత్రంగా
వివరిస్తే 1/8డెమ్మీ 400 పుటల గ్రంథమౌతుంది.
      ఇదంతా శ్రీరంగనిథులవారి పాదుకా స్తుతి. అంటే
దేశికులవారి ఆశు కవన జవన స్తవన శక్తి భువనం లో
నభూతో నభవిష్యతి.
---------------------------------------------------------
వైద్యంవేంకటేశ్వరాచార్యులు

No comments: