వేఱర్థములవేవి వేంకటేశ?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యంలోని ప్రశ్నలకు
సమాధానాలు చేప్పగలరేమో?
చూడండి-
అష్టావధాన శతావధానములకు
వేఱర్థములవేవి వేంకటేశ?
అస్త్రంబననేమి శస్త్రంబనఁగనేమి?
వేఱర్థములవేవి వేంకటేశ?
అక్షబమననేమి అక్షీబమననేమి?
వేఱర్థములవేవి వేంకటేశ?
అగ్రజుండెవఁడగు అవరజుండెవఁడగు?
వేఱర్థములవేవి వేంకటేశ?
శ్రీయుతాకారభువిని నల్పాయువేది?
శేషశైలవాసా చిరజీవియేది?మెప్పుగా నుత్తరమ్ములు చెప్పవలయు
దేవ శ్రీ వేంకటేశ! పద్మావతీశ!
సమాధానాలు-
అష్టావధానము - ఎనిమిదిమంది ఇచ్చే
వివిధ ప్రశ్నలకు జవాబులివ్వడం
శతావధానము - 100 ముంది ఇచ్చే వివిద
ప్రశ్నలకు సామాధానాలివ్వడం
అస్త్రం - మంత్రప్రయోగబాణం
శస్త్రం - ఇనుపబాణం
అక్షిబము - మునగచెట్టు
అక్షీబము - సముద్రపు ఉప్పు
అగ్రజుడు - అన్న
అవగ్రజుడు - తమ్ముడు
అల్పాయువు - పొట్టేలు
చిరజీవి - కాకి
No comments:
Post a Comment