ప్రశ్న ఒకదాన్లో - సమాధానం మరోదాన్లో
సాహితీమిత్రులారా!
ప్రశ్నోత్తర చిత్రం చూద్దామిక్కడ-
ఇందులో ప్రశ్నలు సంస్కృతంలో ఉండగా
సమాధానాలు తెలుగులో ఉన్నాయి
చూడండి-
ఆదిశూన్యే తు కేదారం మధ్యశూన్యే శివాలయమ్అంత్యశూన్యే పయోధారాత్రయః కాంచనవల్లరీ
సమాధానం ఒక మూడక్షరాల పదం.
ఆ పదంలో మొదటి అక్షరం తొలగిస్తేకేదారం అంటే వరిమడి.
మధ్యాక్షరం తీసివేస్తే - శివాలయమ్
అంటే దేవాలయం
చివరి వర్ణాన్ని తొలగిస్తే పయోధారా
అంటే పాలధార
అని వస్తుంది ఆ పదమేదో చెప్పాలి.
సమాధానం - గుమ్మడి
ఈ పదంలో మొదటి అక్షరం - గు
తీసివేస్తే మిగిలేపదం - మడి
అంటే వరి పండేపొలం(కేదారం)
మధ్య అక్షరం తీసివేస్తే - గుడి
చివరి అక్షరం తీసివేస్తే - గుమ్మ
మూడక్షరాల పదం ఒక కూరగాయను
ఒక తీగ చెట్టును తెలుపుతుంది
కావున సమాధానం సరైనదేకదా!
No comments:
Post a Comment