అటువంటి కృష్ణుడు మమ్ము కాపాడుగాక!
సాహితీమిత్రులారా!
లీలాశుకుని శ్రీకృష్ణలీలామృతములోని
ఈ సంవాద చిత్రశ్లోకం చూడండి-
కృష్ణే నామ్బ గతేన రన్తు మధునా మృద్భక్షితా స్వేచ్ఛయా
తథ్యం కృష్ణ క ఏవ మాహ ముసలీ మిథ్యామ్బ ప శ్యాననమ్
వ్యాదేహీతి విదారితే శిశుముఖే దృష్ట్వా సమస్తం జగ
న్మాతా యస్య జగామ విస్మయపదం పాయా త్స వః కేశవః
బలరాముడు -, కృష్ణే నామ్బ గతేన రన్తు మధునా మృద్భక్షితా స్వేచ్ఛయా
అమ్మా మన కృష్ణుడు ఆడుకొనడానికి పోయి,
ఇష్టమువచ్చినట్లు మన్నుతిన్నాడుయశోద - కృష్ణ తథ్యం ?
ఏమిరా కృష్ణా(మన్నుతిన్నది) నిజమేనా ?
కృష్ణుడు - క ఏవ మాహ ?
లేదమ్మా ఎవరు చెప్పింది?
యశోద- ముసలీ
బలరాముడు
కృష్ణుడు - మిథ్యామ్బ ప శ్యాననమ్
అది కల్లమాట
కాదేని నానోరు చూడుము
(నోరు తెరచాడు)
యశోద నోటిలో ఎల్లలోకములు చూచి ఆశ్చర్యపడునది
అటువంటి కృష్ణుడు మమ్ములను కాపాడుగాక!
No comments:
Post a Comment