నల హరిశ్చంద్రీయం లోని విలోమానులోమం
సాహితీమిత్రులారా!
నలహరిశ్చంద్రీయం ఒక విలోమకావ్యం
దీని కర్త ఎవరో తెలియటం లేదు.
దీనిలో ప్రతి పద్యంలో మొదటి నుండి నలుని కథ
చివర నుండి చదివిన హరిశ్చంద్రుని కథ వచ్చే విధంగా
కూర్చబడినది. దీనిలోని చివరి పద్యం -
లీలాకలోమద్యమలోకలాలీ
త్యాగీ సుస్వీ ముగ్ధముస్వీ సుగీత్యా
సభాప్రయానఙ్గనయాప్రభాస
సహాసయా తత్ర తయా సహాస
ఈ పద్యం ఏ పాదాని ఆ పాదం
ముందుకు వెనుకకు ఎలాచదివినా
ఒకే విధంగా ఉంటుంది గమనించగలరు
2 comments:
శ్లోకం మొదటి పాదం ఆరంభంలో *లీసాకలో...* బదులు *లీలాకలో...* అని ఉండాలండి.
ధన్యవాదాలండీ
మీరు చెప్పిందం నిజమే
Post a Comment