కపిలవాయిగారి పొడుపు పద్యం
సాహితీమిత్రులారా!
ఈ పద్యం కపిలవాయి లింగమూర్తి గారి పొడుపు పద్యం
గమనించండి-
వానర బలమెల్ల వార్ధి యేమిట గట్టె?
వైరులు పైకెత్తు వడువు నేది?
అంబుధి దరువగా నందు బుట్టినదేమి?
అవని యహల్య నేమగుచు బడియె?
హరి పవ్వళించిన ఆకు వృక్షంబేది?
పశుపతి నేతీరు ప్రజలు గనిరి?
శంభుని జడలోన చెలగినిలిచినదేమి?
ఆననంబునకేమి అందమయ్యె?
అన్నిటికి జూడ రెండేసి యక్షరములు
ఆదిమాత్రం యందున హర్షముగను
కలుగ గుండాల రాముండు కరుణతోడ
మనల కరుణా విధేయుడై మనుచుచుండు
సమాధానాలు -
వానర బలమెల్ల వార్ధి యేమిట గట్టె - గుండ్లు
వైరులు పైకెత్తు వడువు నేది - డాలు
అంబుధి దరువగా నందు బుట్టినదేమి - లక్ష్మి
అవని యహల్య నేమగుచు బడియె - రాయి
హరి పవ్వళించిన ఆకు వృక్షంబేది - మఱ్ఱి
పశుపతి నేతీరు ప్రజలు గనిరి - లింగం
శంభుని జడలోన చెలగినిలిచినదేమి - గంగ
ఆననంబునకేమి అందమయ్యె - ముక్కు
No comments:
Post a Comment