Friday, April 29, 2022

ద్విప్రాసము

 ద్విప్రాసము




సాహితీమిత్రులారా!



ప్రాస అంటే పద్యపాదంలోని తొలి అచ్చుకు 

రెండవ అచ్చుకు మధ్యగల హల్లు స్వరూపమే

ప్రాసలో అచ్చులకు మైత్రి అవసరంలేదు


ప్రాసలో ఒక హల్లు ఉంటుంది కానీ రెండవ హల్లు కూడ కూర్చిన

దాన్ని ద్విప్రాసమంటారు. దీనికి ఉదాహరణగా ఒక పద్యం-


వనము నిఖిలజన సంజీ

వనము సకృద్దర్శనాభివర్ధిత పుణ్యా

వనము నిరంతరమునిసే

వన ముపంేజీవనము సవనపావనమై

                                                   (ప్రబంధరావేంకటేశ్వరవిజయవిలాసము - 41)

దీనిలో - ప్రాస కానీ దానికితోడు - కూడ కవి కూర్చాడు

కావున ఇది ద్విప్రాసమవుతున్నది.



No comments: