Friday, April 15, 2022

ముక్తపదగ్రస్తము అంటే వినిపించే పద్యం

 ముక్తపదగ్రస్తము అంటే వినిపించే పద్యం




సాహితీమిత్రులారా!



ముక్తపదగ్రస్తమంటే వెంటనే వినిపించే

పద్యం సుదతీ నూతన మదనా

ఈ పద్యం నరసభూపాలీయంలోనిది


సుదతీ నూతన మదనా!

మదనాగతురంగ మణిమయ సదనా!

సదనామయగజరద నా

రదనాగేంద్ర నిభ కీర్తిరస! నరసింహా!

                                                                 (నరసభూపాలీయము - 4-82)

దీని పాదాంతాల్లోని పదాలు విడిచి మళ్ళీ గ్రహించడం వల్ల దీనికి

పాదాంత ముక్తపదగ్రస్తమంటారు

సుదతీ - సుందరమణులపాలిటి

నూతన మదనా - కొత్త మన్మథుడా

మదనాగ - మదించిన ఏనుగులతో

తురంగ - గుర్రాలతో

పూర్ణ మణిమయ - రత్నాలతో మణులతో నిర్మితమైన

సదనా - రాజసౌధంకలవాడా

సత్ - నక్షత్రాలు

అనామయ గజ - దేవతల ఏనుగైన ఐరావతము

రద - దంతాలు

నారద - దేవర్షి నారదడూ

నాగేంద్ర - ఆదిశేషుడూ

నిభ - వీటితో సరివచ్చే

కీర్తిరస - యశస్సు కలవాడా

నరసింహా - ఓ నరసింహభూపతీ

No comments: