సింహావలోకన ముక్తపదగ్రస్తము
సాహితీమిత్రులారా!
ఒక నాయిక దూతికతో అంటున్నది ఈ పద్యం
ఇది నరసభూపాలీయములోనిది
మనవేటికి నూతనమా
తన మానినిఁ బ్రేమఁదనకు దక్కితి ననుమా
నను మానక దయ దనరం
దనరంతులు మాని నరసధవు రమ్మనవే
దీనిలో మొదటి పాదంలో మొదటిలో మనవే, చివరలో తనమా రెండవ పాదం మొదటి పాదం చివరలో వదలిన తనమా తీసుకోవడం జరిగింది. రెండవపాదం చివరలో వదలిన ననుమా మూడవ పాదం మొదటిలో తీసుకోవడం జరిగింది. మూడవపాదం చివరలో వదలిన దనరం చివరిపాదం మొదటిలో తీసుకోవడం జరిగింది. చివరి పాదం చివరలో మనవే అన్నది మొదటి పాదం మొదటిలో వదలినది ఇక్కడ తీసుకోవడంతో సింహావలోకన ముక్తపదగ్రస్తమవుతున్నది
(మనవి - విన్నపం, ఏటికి - ఎందుకు, నూతనమా - నేనూ నాసంబంధం ఏమైతా క్రొత్తదా, తన మానినిన్ - ఆయనగారి ప్రేయసిని నేను, ప్రేమన్ -అనురాగంతో, తనకున్ - ఆయనగారికి, దక్కితిన్ - దక్కాను, లోబడ్డాను, అనుమా - అని చెప్పవే, ననున్ - నన్ను, మానక - విడిచిపెట్టక, తిరస్కరించక, కాదనక, దయ + తనరన్ - దయ ఒప్పారేలాగా, తన - ఆయనగారి, రంతులు - అలకలు జగడాలు, మాని - ఇక విడిచిపెట్టి, నరసధవున్ - ఆ ఓబళ నరసభూపాలుణ్ని రమ్మనవే - రమ్ము అనవే - రమ్మని చెప్పవే నీకు పుణ్యం ఉంటుంది)
No comments:
Post a Comment