రెండు వృత్తాలలో ఒక కందం
సాహితీమిత్రులారా!
బోడి వాటుదేవరావుగారి చిత్రమంజరిలో
రెండు మదనవిలసిత వృత్తాలలో
ఒక కందం కూర్చారు అది-
మదనవిలసితం -1
అరిదర ధరు భూ
వరుహరి వరదున్
సరసిజ నయనున్
బరు, దృహిణపితన్
మదనవిలసితము - 2
గరుడ గమను శం
కర నుత చరణున్
సురరిపు దమనున్
స్మరగురు దలతున్
ఈ రెండిటితో కందపద్యం-
మొదటి మదనవిలసితం ఒకటి, రెండు పాదాలుగా
రెండవ మదనవిలసితం మూడు నాలుగు పాదాలుగా వ్రాస్తే
కందం అవుతుంది
అరిదర ధరు భూ వరుహరి
వరదున్ సరసిజ నయనున్ బరు, దృహిణపితన్
గరుడ గమను శంకర నుత
చరణున్ సురరిపు దమనున్ స్మరగురు దలతున్
ఇది కందపద్యం.
No comments:
Post a Comment