కొన్ని పేరడీలు
సాహితీమిత్రులారా!
ఈ పేరడీలను ఆస్వాదించండి................
నేను సైతం
నేను సైతం నేజ్‌డేక్‌కే
లైఫ్‌సేవింగ్స్ ధారపోశాను
నేను సైతం డాట్‌కాముల
చితుల్లో ఒక చిదుగు నయ్యాను
నేను సైతం మొత్తం పోగా
తేలుకుట్టిన దొంగ నయ్యాను
నా ప్రారబ్ధం
నా ప్రారబ్ధం కాదు అబద్ధం
ఇంకెన్నటికీ నాకు చేకూరదు అర్ధం
చేసుకున్నాను సంపాదనంతా వ్యర్థం
నా స్టాకుల్తో నేనే పెట్టుకున్నాను శ్రాద్ధం
నా ఇంటి పాల రాల నేల
నా దొడ్లో ఒలింపిక్ సైజ్ పూల్‌ల
రోజూ చూసుకుంటున్నా స్వప్నాల
అవే ఇప్పుడు నాకు పాడుతాయి జోల
నా స్టాకులు ఆకాశాన్నుంచి రాలే భుగభుగల ఉల్కలు
నా స్టాకులు ఉలుకూ పలుకూ లేని పంచరంగుల చిల్కలు
నా స్టాకులు తిరగటానికి వెన్నెల లేని అందమైన ఆడపిల్లలు
NASDAQ
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే
నిబిడానందంతో వీరు
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్భాగ్యంగా వీరె …
---------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment