శాంతుడు, దాంతుడు అనగానేమి?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం
విచ్చండి-
దశబలుండెవ్వండు దశహయుఁడెవ్వండు?
వేఱర్థములనేవి వేంకటేశ?
దశహస్తుఁడెవ్వండు దశముఖుఁడెవ్వండు?
వేఱర్థములనేవి వేంకటేశ?
శాంతుఁడెవ్వండౌను దాంతుఁడెవ్వండౌను?
వేఱర్థములనేవి వేంకటేశ?
పంచమంగళమేది పంచభద్రమ్మేది?
వేఱర్థములనేవి వేంకటేశ?
శంఖసక్రధరా! గుహాశయమదేది?
శరధిశయనా! యికగృహాశయయదేది?
మెప్పుగా నుత్తరమ్ములు చెప్పవలయు
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!
సమాధానాలు-
1. దశబలుడు - బుద్ధుడు
2. దశహయుడు - చంద్రుడు
3. దశహస్తుడు - శివుడు
4. దశముఖుడు - రావణుడు
5. శాంతుడు - అంతరింద్రియ నిగ్రహముగలవాడు
6. దాంతుడు - బహిరింద్రియ నిగ్రహముగలవాడు
7. పంచభద్రము - 5 మంచి లక్షణాలుగల గుఱ్ఱము
8. పంచమంగళము - 5 మంచి లక్షణాలుగల యేనుగు
9. గుహాశయము - సింహము(గుహలో నిద్రించేది)
10. గృహాశయ - తమలపాకుతీగ(ఇంటిలోవలె నీడనాశించేది)
No comments:
Post a Comment