వారిజనేత్ర దుర్వర్ణమేది?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యంలోని ప్రశ్నలకు
సమాధానాలు చెప్పగలరేమో
చూడండి-
ఉదధిశయన హరీ ఉచ్ఛ్వాసమననేది?
సరసిజనాభ నిశ్వాసమేది?
వైకుంఠవాసా సువర్ణంబనఁగనేది?
వారిజనేత్ర దుర్వర్ణమేది?
గజరాజరక్షకా గర్భేశ్వరుఁడెవండు?
శ్రీపతీగర్భదరిద్రుఁడెవఁడు?
సరసిజలోచనా సంకల్పమననేది?
కలుషవిధ్వంస వికల్పమేది?
క్షతిసతీనాయకా ఉపకృతియదేది?
పతితజనపావనా అపకృతియదేది?
మెప్పుగానుత్తరమ్ము చెప్పవలయు
దేవ! శ్రీవేంకటేశ! పద్మవతీశ!
దీనిలో పది ప్రశ్నలున్నవి వాటికి
సమాధానాలు చెప్ప ప్రయత్నించండి.
సమాధానాలు ఇక్కడ సరిచూచుకొనుడు-
1. ఉచ్ఛ్వాసము - ఊపిరి వెలికి వదలుట
2. నిశ్వాసము - నిట్టూర్పు
3. సువర్ణము - బంగారు
4. దుర్వర్ణము - వెండి
5. గర్భేశ్వరుడు - తల్లిగర్భములో జన్మించినప్పటికే భాగ్యవంతుడు
6. గర్భదరిద్రుడు - తల్లిగర్భములో జన్మించినప్పటికే దరిద్రుడు
7. ఉపకృతి - ఉపకారం
8. అపకృతి - అపకారం
9. సంకల్పం - కోరిక
10. వికల్పం - భ్రాంతి
No comments:
Post a Comment