ఆద్యుత్తర ప్రహేళిక
సాహితీమిత్రులారా!
ప్రహేళికలో సమాధానాన్ని బట్టి పేరు ఏర్పడుతుంది.
మొదటే సమాధానం వుంటే దాన్ని ఆద్యుత్తరప్రహేళిక
అంటున్నాము. దీనికి ఉదాహరణగా ఈ శ్లోకం చూడండి-
"కురవః" కీదృక్ పరభృత తరుణః త్వయి భాతి జ్వలంత్యామ్?
భీమం ప్రాప్య విలీనాః సహోదరాః కే శతం బ్రూహి?
దీనిలో రెండు ప్రశ్నలున్నాయి-
వాటి సమాధానం మొదటే ఉంది.
సమాధానం శ్లోకంలోనే ఉంటే అది
అంతర్లాపిక ప్రహేళిక అవుతుంది.
అందులో సమాధానం మొదటే ఉంది
కావున దీన్ని అంతర్లాపికలో ఆద్యుత్తర
ప్రహేళిక అంటారు.
సమాధానం - కురవః
రెండుప్రశ్నలకు సమాధానం ఒకటే
అందువల్ల దీన్ని ఏకోత్తర ప్రహేళిక
అనికూడ అనవచ్చు.
"కురవః"
1. కీదృక్ పరభృత తరుణః త్వయి భాతి జ్వలంత్యామ్?
నీవు సంభాషించు చుండ యువకోకిల ఎట్లుండును
- కురవః - కుత్సిత(నికృష్ట)మైన ధ్వని చేస్తున్నట్లుండును.
(కురవః ఏకవచనం(కురవః - కురవౌ - కురవాః))
2. భీమం ప్రాప్య విలీనాః సహోదరాః కే శతం బ్రూహి?
భీముని చూచి దాగుకొన్న నూర్గురు సహోదరులెవరు
- కురవః - కురువంశమున పుట్టిన దుర్యోధనుడు మొదలైనకౌరవులు.
(కురవః బహువచనం(కురుః - కురూ - కురవః))
No comments:
Post a Comment