ఏకోత్తర చిత్రం
సాహితీమిత్రులారా!
శ్లోకంలోని అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానమైతే
దానికి "ఏకోత్తర చిత్రమ"ని పేరు. ఈ శ్లోకం గమనించండి-
భ్రమ రహితః కీ దృక్షో, భవతి తరాం వికసితః పద్మ:
జ్యోతిషికః కీ దృక్ష: ప్రాయో భువి పూజ్యతే లోకై:
దీనిలో రెండు ప్రశ్నలున్నాయి
వాటికి సమాధానం ఒకటే పదం.
సమాధానం ఇందులోనే ఉండటం వల్ల ఇది
అంతర్లాపిక సంబంధమైనదిగా
అది - "భ్రమరహితః"
1. కీ దృక్షో భవతి తరాం వికసితః పద్మ:?
వికసించిన తామరపువ్వు ఎలా ఉంటుంది?
- భ్రమరహితః
భ్రమర హితః భ్రమరములకు ఇష్టమైనది ఏది? తామరపువ్వు
అక్కడ (భ్రమర, హితః ) భ్రమరములకు, తుమ్మెదలు హితమైనది.
2. జ్యోతిషికః కీ దృక్ష: ప్రాయో భువి పూజ్యతే లోకై:?
ఎటువంటి జ్యోతిష పండితుడు గౌరవింపబడుతాడు?
- భ్రమరహితః
భ్రమ రహితః భ్రమలేకుండా స్పష్టంగా చెప్పగలిగినవాడే జ్యోతిషునిగాఅందరిచేతా గౌరవించబడతాడు.
ఇక్కడ భ్రమ, రహితః భ్రమ లేకుండా చెప్పేవాడు,
No comments:
Post a Comment