చిత్రకవిత్వంలో భేదాలు
సాహితీమిత్రులారా!చిత్రకవిత్వం అనేకులు అనేక విభాగాలుగా వివరించారు.
కొందరు 1. శబ్దచిత్రం 2. అర్థచిత్రం 3. ఉభయచిత్రం అని విభజించారు.
మరికొందరు శబ్దచిత్రం, గతిచిత్రం, గూఢచిత్రం, కూటచిత్రం, గర్భచిత్రం, ఆకారచిత్రం (బంధకవిత) ఇలా అనేక విభాగాలుగా విభజించారు.
శబ్దచిత్రం :-
దీనిలో అనేక రకాలు ప్రస్తుతం ఏకాక్షర శ్లోకం ఒకదాన్ని గమనిద్దాం.ఏకాక్షర శ్లోకం
మామామమామమేమామా మామూమామేమమేమమే
మామామేమిమిమేమా మమమోమామామమామమీ
ఇందులో వ్యంజనం(హల్లు) ఒకటే ఉంటుంది కాని అచ్చులు ఏవైనా ఆ వ్యంజనం కూడి వస్తుంటాయి.
ఇది ఏకాక్షరగా ''మ'' అనే ఒక వ్యంజనం కలిగి ఉన్నందున ఏకవ్యంజనముగా పిలుస్తారు.
శ్లోకం అర్థం
మమ = నాయొక్క, మా = బుద్ధి, ఇమాం మామ్ = ఈ లక్ష్మిని, ఆమ = పొందెను, అమేం - అమా = సహితురాలైన,
ఈ = లక్ష్మిగల, అమ్ = నీ పాదమును, ఆమామూమ = ఆశ్రయించితిమి, అమే = ఓ దుర్భుద్దీ జ్యేష్ఠాదేవీ, మే = నాకు, అమ = దూరంగా వెళ్లుము, అమామ్ = లక్ష్మి కంటె వేరైన దేవతను, మా , ఏమి =పొందను, అమ: = బంధరహితుడనై, మామం - మా = లక్ష్మి యొక్క, అమమ్ = ప్రాపును, మిమే = అపేక్షింతును, అమీ = ఈ మేము, మామ్ = ప్రమాణమైన శాస్త్రమును, మా అమామ = అతిక్రమింపము-
2 comments:
I appreciate this Slokam
శ్లోకానికి పద విభజనం క్రింద ఇస్తే ఎట్లా చదవితే అర్థం వస్తుందో కూడా ఇవ్వగలరు
(పదాల్ని ఎక్కడ విడిగా ఎక్కడ కలిపి చదివితే )
దయచేసి ఇవ్వగలరు
జిలేబి
Post a Comment