Monday, March 21, 2016

చిత్రకవిత్వంలో భేదాలు

చిత్రకవిత్వంలో భేదాలు

సాహితీమిత్రులారా!
చిత్రకవిత్వం అనేకులు అనేక విభాగాలుగా వివరించారు.
కొందరు 1. శబ్దచిత్రం 2. అర్థచిత్రం 3. ఉభయచిత్రం అని విభజించారు.
మరికొందరు శబ్దచిత్రం, గతిచిత్రం, గూఢచిత్రం, కూటచిత్రం, గర్భచిత్రం, ఆకారచిత్రం (బంధకవిత) ఇలా అనేక విభాగాలుగా విభజించారు.

శబ్దచిత్రం :-

దీనిలో అనేక రకాలు ప్రస్తుతం ఏకాక్షర శ్లోకం ఒకదాన్ని గమనిద్దాం.
ఏకాక్షర శ్లోకం 
మామామమామమేమామా మామూమామేమమేమమే
మామామేమిమిమేమా మమమోమామామమామమీ

ఇందులో  వ్యంజనం(హల్లు) ఒకటే ఉంటుంది కాని అచ్చులు ఏవైనా ఆ వ్యంజనం కూడి వస్తుంటాయి.
ఇది ఏకాక్షరగా  ''మ'' అనే ఒక వ్యంజనం కలిగి ఉన్నందున ఏకవ్యంజనముగా పిలుస్తారు.
శ్లోకం అర్థం
మమ = నాయొక్క, మా = బుద్ధి, ఇమాం మామ్ = ఈ లక్ష్మిని, ఆమ = పొందెను, అమేం - అమా = సహితురాలైన,
ఈ = లక్ష్మిగల, అమ్ = నీ పాదమును, ఆమామూమ = ఆశ్రయించితిమి, అమే = ఓ దుర్భుద్దీ జ్యేష్ఠాదేవీ, మే = నాకు, అమ = దూరంగా వెళ్లుము, అమామ్ = లక్ష్మి కంటె వేరైన దేవతను, మా , ఏమి =పొందను, అమ: = బంధరహితుడనై, మామం - మా = లక్ష్మి యొక్క, అమమ్ = ప్రాపును, మిమే = అపేక్షింతును, అమీ = ఈ మేము, మామ్ = ప్రమాణమైన శాస్త్రమును, మా అమామ = అతిక్రమింపము-

2 comments:

yuvasri said...

I appreciate this Slokam

Zilebi said...


శ్లోకానికి పద విభజనం క్రింద ఇస్తే ఎట్లా చదవితే అర్థం వస్తుందో కూడా ఇవ్వగలరు

(పదాల్ని ఎక్కడ విడిగా ఎక్కడ కలిపి చదివితే )

దయచేసి ఇవ్వగలరు



జిలేబి