చిత్రకవిత్వం
సాహితీమిత్రులారా!
కావ్యాలోకంలో డా. ఎన్.వి.ఆర్.కృష్ణమాచార్యులుగారు కావ్యభేదాలను రెండురకాలుగా వివరించారు.
1. ప్రాచీనం - ఆశు, మధుర, చిత్ర, విస్తరములు
2. నవీనం - ఆఖ్యానరీతి, నాటకరీతి, ప్రబంధరీతి, భావకవితారీతి - అని వివరించారు.
ఇందులో మనం చిత్రకవిత్వం - అనేదాన్ని విచారిస్తే ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అద్భుతాలను చేసే కవితాప్రక్రియ.
దీన్ని పాఠకుడు పొందాలంటే కొంత పరిశ్రమచేయాలి, మేధను ఉపయోగించాలి లేకుంటే కష్టమే. ఒక దాన్నిపొందాలంటే కొంత శ్రమచేయాల్సిందేకదా!
అలాంటి కవిత్వవిశేషాలు చాలా భాషల్లో ఉన్నాయి వాటిని గురించి ఇక ప్రతిరోజు కొంత కొంత ముచ్చటించుకుందాం.
No comments:
Post a Comment