ప్రహేళిక - 1
సాహితీమిత్రులారా!
అరువదిరెండుకుచంబులు
శిరమొక్కడు రెండువేలు చెవులున్ తానున్
ఇరువైరెండు భుజంబులు
తరుణీ! ఏయూరు నీది దాచక చెపుమా?
ఈ పద్యం చూడగా అరువదిరెండు కుచములు (చన్నులు), శిరము (తల) ఒకటి, తాను రెండువేల చెవులు, ఇరువైరెండు భుజాలు, దాచకుండా నీది ఏవూరో చెప్పుము తరుణీ (ఓ స్త్రీ)! అనే అర్థం కనబడుతోంది
ఇది సరైన అర్థంగా కనబడటంలేదుకదా! సరైన అర్థం కావాలంటే దీన్ని ఈ విధంగా అర్థం తీసుకోవాలి.
అరువది అంటే తమిళ స్త్రీ, ఇరువై అంటే ఇరువగు - ఒప్పినట్టి - అని.
ఓ తమిళ స్త్రీ! రెండు కుచములతో, ఒక శిరముతో, రెండు వ్రేలాడు చెవులతో, తగినట్టి రెండు భుజాలతో ఉన్నావు. ఏవూరునీది - అనేది అర్థం.
No comments:
Post a Comment