ఏకాక్షర పాదం
సాహితీమిత్రులారా!భారవి కిరాతార్జునీయంలో రాసిన ఏకాక్షరపాద శ్లోకం గమనిద్దాం.
శ్లో. స సాసి: సాసుసూ: సాసో
యేయాయేయాయయాయయ:
లలౌలీలాం లలో2లోల:
శశీశశిశుశీ: శశన్
(కిరాతార్జునీయమ్ -15-5)అర్థం :- సాసి: = ఖడ్గంతో ఉన్న, సాసుసూ: = ప్రాణాలను హరించే బాణాలు థరించినవాడు,సాస: = ధనువును థరించినవాడు, యేయ + అయేయ + అయయ + అయయ - వాహనంతోను, వాహనంలేకుండా శత్రువుని చేరి వారి వాహనాలను స్వాథీనం చేసుకున్నవాడు, లల: = అందమైనవాడు, అలోల: = చాపల్యంలేనివాడు, శశి +ఈశ + శశు + శీ: - ఈశ్వరుని కుమారుడైన కుమారస్వామిని పరుగెత్తింపచేసే, స: = అర్జునుడు, లీలాం = శోభను, లలౌ = పొందాడు.
No comments:
Post a Comment