చిత్రకవిత్వ ప్రశంస
సాహితీమిత్రులారా!ప్రకాశంజిల్లా, కలికివాయిగ్రామనివాసిగా ఉండిన శ్రీ విక్రాల శేషాచార్యుల వారి శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరం ఉత్తరభాగంలోనిది ఈ ప్రశంస.
మృదుల కవితరీతి మేదురమౌ చిత్ర
కవితగూడ కవికి గాంక్ష గొలుపు
పూలదండ యట్లు ముత్యాల దండయు
గన్నులున్న వాన్కిఁ గాంక్ష నిడదె
ప్రాకటమైన నాగముఖబంధము లా రతి కాల బంధముల్
స్వీకృత గర్భ ధారణము శ్రీకర గర్భ కవిత్వ విభ్రమం
బా కవితా వధూమణికి నారయ కబ్బము సంతుకాదొకో
కవితాచిత్రవిదుండు కోమల కథా కావ్యమ్మునున్మాడ్కి స
త్కవి సూక్తంబగు ప్రౌఢచిత్రకవితాకావ్యమ్మునుం గూడ చ
ద్వి వినోదించు, నదెట్లన సతి మాధ్వీకాభమౌ వాతెఱం
జవి గొంచుం గఠినమ్మటంచు వీడునే నాథుం డురోజద్వయిన్
కోమల కావ్య సారమును గ్రోలి ప్రమోదము నొందు రీతి
భూమినిఁ బ్రౌఢ చిత్రకృతిఁ బొల్పగు శబ్ద విచిత్రలక్ష్మి నేనీ
ధీమహితుండు కాంచి మరితృప్తిని గాంచునొ వాఁడె సాహితీ
ధీమహితుండు వాఁడె జగతిన్మము బోంట్లకు శ్లాఘనీయుడున్
ఎలాంటి పదాలతో ఎంత ఘాటుగా ఉందో ఈ ప్రశంస.
మళ్ళీ కలుసుకుందాం.
No comments:
Post a Comment