Sunday, August 9, 2026

 మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 4


సాహితీమిత్రులారా!



మాతృకావిలాములోని ఏకాక్షరనిఘంటువు తరువాయి భాగం ..

ఘఘాఘి ఘీ ఘు ఘూ ఘే ఘై ఘో ఘౌ ఘం ఘః ॥ 4

ఘః సూనుర్ఘో ఘటో మేఘో వహ్నిః పూషా నృపో గజః ॥

ఘా రమ్యా చ శచీ దుర్గా భూమిర్ఘృతవర్తినీ ॥ 13

ఘీః కుమారోమరాచార్యో ఘుర్మూఢోకరుణః ఫణీ ॥

ఘూర్భూమిఘూస్సురాధీశో గుదః సంకర్షణోమలః ॥ 14

ఘేః శంఖః కుక్కరః కాలో ఘైః సూర్యః సరమాసుతః ॥

ఘోర్ఘోషో ఘౌః సురావాసః పాప్మాఘం పాపఘంటయోః ॥ 15

ఘః ప్రాగుక్తోపి ఘటనేవస్మరే వనగర్జనే ॥

·         ఘ: కుమారుడు (సూనుః), కుండ (ఘటః), మేఘము, అగ్ని,

              సూర్యుడు (పూషా), రాజు, ఏనుగు.

·         ఘా: రమ్యమైన స్త్రీ, శచీదేవి, దుర్గ, భూమి.

·         ఘి: కుమారస్వామి, బృహస్పతి (అమరాచార్య).

·         ఘు: మూఢుడు, దయ లేనివాడు (అకరుణః), పాము (ఫణి).

·         ఘూ: భూమి, ఇంద్రుడు, బలరాముడు (సంకర్షణ).

·         ఘే: శంఖము, కుక్క, కాలము.

·         ఘై: సూర్యుడు, కుక్క పిల్ల (సరమాసుతః).

·         ఘో: శబ్దము (ఘోషః).

·         ఘౌ: దేవతల నివాసం.

·         ఘం: పాపము, గంట. 



ఙఙాఙిఙీఙుఙూఙేఙైఙో ఙౌఙంఙః ॥ 5

ఙః ప్రాణస్తురగోనాసో బాలకో ఙా ధరా రమా ॥ 16

ఙివీభత్సుర్మృగః సూక్ష్మో ఙీర్భూపః కృకలాశయః ॥

ఙుః సూకరోథ యత్రో ఙే సూతో ఙైః పరాశరః ॥ 17

ఙోశ్చ సింహోథ ఙౌ శూర్పోరుణవహ్నిముఖో రవిః ॥

ఙం ఘంటా వరుణస్తోయం శబ్దానుకరణం తథా ॥ 18

ఙః ప్రాగుక్తోపి హరణే హననే చ నిషేధనే ॥ 

·         ఙ: ప్రాణము, గుర్రము, ముక్కు లేనివాడు, బాలుడు.

·         ఙా: భూమి, లక్ష్మి (రమ).

·         ఙి: భయంకరమైనవాడు (వీభత్సుడు), జింక, సూక్ష్మము.

·         ఙీ: రాజు, ఊసరవెల్లి (కృకలాశయః).

·         ఙు: పంది (సూకరము).

·         ఙే: సూతుడు.

·         ఙై: పరాశర మహర్షి.

·         ఙో: సింహము.

·         ఙౌ: చేట (శూర్పః), సూర్యుడు, అగ్ని.

·         ఙం: గంట, వరుణుడు, నీరు, శబ్దానుకరణం.

·         ఙః: దొంగిలించడం (హరణ), చంపడం (హనన), నిషేధించడం.


No comments: