Friday, August 7, 2026

 మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 2

సాహితీమిత్రలారా!

ఏకాక్షర నిఘంటువులోని తరువాయి భాగం - 



ఖఖాఖిఖీఖుఖూఖేఖైఖోఖౌఖంఖః ॥ 2

ఖః సూర్యో వివరోవశ్చ ఖో మా క్ష్మా కమలా చ గీః ॥ 5

ఖిః కామః ఖీర్గుదో ధాతా ఖుర్వహ్నిః ఖూబృహస్పతిః ॥

ఖేః ప్రాణః ఖైర్భవో భ్రాతా పుత్రః ఖోః ఖంజ ఇష్యతే ॥ 6

ఖౌః సురేశోగ్నిరీశోర్కః ఖం వ్యోమ చ ఖమింద్రియమ్ ॥

ఖః ప్రాగుక్తోపి ఖననే ఖండనేతీతకాలకే ॥ 7


·                    ఖ: సూర్యుడు, రంధ్రము (వివరము), ఆకాశము.

·         ఖా: లక్ష్మి (కమల), భూమి (క్ష్మా), సరస్వతి (గీః).

·         ఖి: మన్మథుడు (కామః).

·         ఖీ: గుదము, బ్రహ్మ (ధాత).

·         ఖు: అగ్ని (వహ్ని).

·         ఖూ: బృహస్పతి.

·         ఖే: ప్రాణము.

·         ఖై: శివుడు (భవః), సోదరుడు (భ్రాత).

·         ఖో: పుత్రుడు, కుంటివాడు (ఖంజః).

·         ఖౌ: ఇంద్రుడు (సురేశః), అగ్ని, ఈశ్వరుడు, సూర్యుడు (అర్కః).

·         ఖం: ఆకాశము (వ్యోమ), ఇంద్రియము.

·         ఖః: తవ్వడం (ఖనన), ఖండించడం, గడిచిపోయిన కాలం.

No comments: