Saturday, August 8, 2026

 మాతృకావిలాసంలోని ఏకాక్షరనిఘంటువు - 3


సాహితీమిత్రులారా!




మాతృకావిలాములోని ఏకాక్షరనిఘంటువు తరువాయి భాగం ..

గగాగిగీగుగూగేగైగోగౌగం గః ॥ 3

గో గణేశే తథా ప్రీతో భవః శ్రీపతిరుత్తమః ॥

గా క్ష్మా గా చరమా గిధః శ్రీమానప్యంబుధిః పుమాన్ ॥ 8

గీర్వాణీ గీః సురా పత్నీ సుధా గుః ప్రాణ ఆసవః ॥

గుః కాంతిర్మదనో భీరుర్గుశ్చ సేతుః సఖా రవిః ॥ 9

గురుః పురీషం గూః వాదో గేః పాపీ జనవంచకః ॥

గైః పలాశోథ శోకోగ్నిః సూర్యో గోద్విపదః కరీ ॥ 10

గౌర్వజ్రం గౌః ప్రభా భూమిర్వాణీ తోయం త్రివిష్టపమ్ ॥

ధేనుర్వత్సో వృషో దిగ్గౌర్నేత్రం లజ్జా గురుః రమా ॥ 11

ఇంద్రియం శ్రీరుమా గం చ వాదిత్రం శరణం వరమ్ ॥

గః ప్రాగుక్తోపి గహనే గమనే గర్జనే తథా ॥ 12  

·         గో: గణేశుడు, శివుడు (భవః), విష్ణువు (శ్రీపతి).

·         గా: భూమి (క్ష్మా).

·         గి: సముద్రము (అంబుధి).

·         గీ: సరస్వతి (గీర్వాణి), దేవతల భార్య, అమృతము (సుధ).

·         గు: ప్రాణము, మద్యము (ఆసవః).

·         గూ: కాంతి, మన్మథుడు, భయపడేవాడు (భీరుః), వంతెన (సేతుః)

               మిత్రుడు (సఖా)సూర్యుడు (రవి).

·         గే: విరేచనము (పురీషం), పాపి, వంచకుడు.

·         గై: పనస చెట్టు (పలాశః), శోకము, అగ్ని, సూర్యుడు.

·         గౌ: ఏనుగు (కరీ), వజ్రాయుధము, కాంతి (ప్రభ), భూమి, వాక్కు

              నీరు, స్వర్గము, ఆవు, దూడ, ఎద్దు, కన్ను, లజ్జ, లక్ష్మి (రమ).

·         గం: వాద్యము, శరణు, వరము.

·         గః: లోతైనది (గహన), వెళ్లడం (గమన), గర్జించడం.


 

No comments: