ఒక చాటు పద్యం కవికి తెచ్చిన చేటు
సాహితీమిత్రులారా!
రాజులని పొగుడుతూ రాసిన కవితలు, తెగడుతూ రాసిన కవితలు మనకి కొత్త కాదు. రాజకీయనాయకులపై వ్యంగ్య సాహిత్యం, ముఖ్యంగా హాస్యకవితలు తెలుగులో శ్రీశ్రీ మొదలైన ఆథునిక కవులు రాశారని వేరే చెప్పనక్కరలేదు. అయితే, ఆ రచనలు ఆ కవుల జీవనానికి, జీవితానికీ ఏ విధమైన ఆపదా తెచ్చి పెట్టలేదు. ప్రాచీన చాటు సాహిత్యంలో పోతరాజు వేములవాడ భీమకవిని తన రాచరిక భేషజం చూపించి ఇబ్బంది పెట్టాడని, భీమకవి వాడిని శపించాడని, ఆ తరువాత పోతరాజు భీమకవికి క్షమాపణ చెప్పాడనీ, భీమకవి శాపం తొలగించాడనీ ఒక చక్కని చాటు కథ ప్రచారంలో ఉన్నది.
అయితే ఒక చాటువు, ఒక చతురోక్తి కవిత, ఒక వ్యంగ్య కవిత ఒక కవి జీవితానికే ముప్పు తెచ్చిన ఘట్టం రష్యన్ చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. ఈ వ్యాసంలో, ఆ చాటువు గురించి ముచ్చటిస్తాను.
సాధారణంగా ప్రతి చాటువుకీ పూర్వకథ వుంటుంది. ఆకథ తెలియకపోతే, ఆ చాటువు పొడిపొడి వాక్యాలు కత్తిరించి పేర్చిన వచన పద్యంలా పేలవంగా కనబడుతుంది. రక్తి కట్టదు. కొన్ని చాటువుల్లో ప్రతి పాదానికీ వెనుక ఒక కథ వుండచ్చు. అటువంటి చాటువు, ఓసిప్ మాండిల్‌స్టామ్ (Osip Mandelstam) రాసిన ఎపిగ్రామ్ ఎగైన్స్ట్ స్టాలిన్ (Epigram Against Stalin.)
ఈ చిన్న పద్యం చాలా భాషల్లోకి అనువదించబడింది.ప్రముఖ అనువాదకులు మర్విన్ (W. S. Merwin), ఆండర్సన్ (Darren Anderson), తదితరులు ఇంగ్లీషు లోకి అనువదించారు. అంతర్జాలంలో వెతికితే, ఈ చాటువుపై, మాండిల్స్టామ్పై చాలా వ్యాసాలు, వ్యాఖ్యలూ దొరుకుతాయి. ఈ వ్యాసం చివర, ఇతర అనువాదాలు, రష్యన్ మాతృక ఇస్తాను. ముందుగా నేను తీసుకున్న అనువాదం, ఎస్థర్ ఆలెన్ (Esther Allen) స్పానిష్ నుంచి ఇంగ్లీషులోకి తెచ్చిన అనువాదం. రష్యన్ నుంచి హోసె ప్రియెటో (Jose Manuel Prieto) స్పానిష్ లోకి అనువదించాడు. ఈ కవితలో ప్రతిపాదానికీ ఉన్న వెనుక కథ చెపుతూ ఒక పెద్ద వ్యాఖ్య కూడా రాశాడు. ఎస్థర్ ఆలెన్ ఆ వ్యాసాన్ని ఇంగ్లీషులోకి అనువదించింది. (The New York Review of Books, June 10, 2010.) నా వ్యాఖ్యకి అది ముఖ్య ఆధారం. అంతర్జాలంలో వచ్చిన కొన్ని వ్యాఖ్యలు కూడా వాడుకున్నాను.
Epigram Against Stalin
We live without feeling the country beneath our feet,
our words are inaudible from ten steps away.
Any conversation, however brief,
gravitates, gratingly, toward the Kremlin’s mountain man.
His greasy fingers are thick as worms,
his words weighty hammers slamming their target.
His cockroach mustache seems to snicker,
and the shafts of his high-topped boots gleam.
Amid a rabble of scrawny-necked chieftains,
he toys with the favors of such homunculi.
One hisses, the other mewls, one groans, the other weeps;
he prowls thunderously among them, showering them with scorn.
Forging decree after decree, like horseshoes,
he pitches one to the belly, another to the forehead,
a third to the eyebrow, a fourth in the eye.
Every execution is a carnival
that fills his broad Ossetian chest with delight.
—Translated by Esther Allen from José Manuel Prieto’s Spanish version (The New York Review of Books, June 10, 2010.)
స్టాలిన్ పై చాటువు
అడుగున అడుగులకంటిన
మట్టి స్పర్శ
గురుతెరగని
బ్రతుకులు మనవి.
ప్రక్కన
పది అడుగుల దూరంలో
మాటాడిన మాటలు
చెవినపడవు, వినపడవు.
ఈ పాదాలకి వ్యాఖ్య చెప్పబోయే ముందు, సోవియట్ యూనియన్ చరిత్ర మననం చేసుకోవాలి. లెనిన్ మరణించిన తరువాత, స్టాలిన్ గద్దెకెక్కాడు. సుమారు ముప్ఫై సంవత్సరాలు (1924-1953) పరమనిరంకుశంగా పరిపాలించాడు. స్టాలిన్ హయాములో — కారణం ఏదయితేనేమి — మరణించిన సోవియట్ ప్రజల సంఖ్య ఇరవై మిలియన్ల నుంచి అరవై మిలియన్ల వరకూ ఉంటుందని అంచనా! కొన్ని వందలమంది రచయితలని, కవులని, ఉద్యమకారులనీ స్టాలిన్ ప్రభుత్వం హతమార్చింది, తుపాకి తోటి; కాకపోతే సైబీరియాకి పంపీ!
మాండిల్‌స్టామ్ 1933లో స్టాలిన్ రాజ్యాంగ విధానంపై నిరసనగా పైన చెప్పిన చాటువు ‘రాశాడు’. 1934 చివరలో అతనిని ఖైదులో పడేశాడు, స్టాలిన్.
ఆ రోజులలో, సోవియట్ పౌరులు ఎంత భయంగా బ్రతికేవారో మొదటి పాదంలో కనిపిస్తుంది. పద్యంలో వాడిన రష్యన్ పదం చుయత్ (chuyat.) వాసన పసిగట్టి వెంటాడే వన్యమృగ కౄరతని గుర్తుకు తెచ్చే పదం. నేలమీద నిలబడిన వ్యక్తి ఉనికికే ప్రమాదం సుమా! అని సూచించే పాదం. సోవియట్ పౌరులు అతి మెల్లగా గుసగుసలాడుతున్నట్టు ఒకరితో ఒకరు మాట్లాడటానికి అలవాటు పడ్డారు, ఆ రోజుల్లో! అంత భయంతో బ్రతికేవారని రెండవ పాదం. పిల్లల ముందు పెద్దవాళ్ళు ఏ సున్నితమైన విషయం మాట్లాడటానికైనా సరే, సంకోచించేవాళ్ళు.
ఐౙయా బెర్లిన్ (Isaiah Berlin) ఆనా ఆఖ్మతోవాని (Anna Akhmatova) కలిసినప్పుడు, ఆఖ్మతోవా చూరు కేసి వేలు చూపించిందట — వాళ్ళ సంభాషణలు మూడవ వ్యక్తి వినడానికి ఆస్కారం ఉన్నది సుమా అని గుర్తు చేస్తూ! మాస్కోలో టెలిఫోనులు స్టాలిన్ అనూయాయులు ట్యాప్ చేసారనే వదంతి ప్రబలంగా ఉన్న రోజులవి, సాంకేతికంగా ఆ రోజుల్లో అసాధ్యం అని తెలిసినప్పటికీ.
బోరిస్ బఝనొవ్ (Boris Bazhanov) తన స్వీయ చరిత్రలో రాస్తాడు: స్టాలిన్ క్రెమ్లిన్‌లో ఉండే ఇతర కమ్యూనిస్ట్ నాయకుల సంభాషణలు వినటానికి ప్రత్యేకమయిన వసతి కల్పించుకున్నాడట. ఒకసారి, బోరిస్ పొరపాటున మరొక తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడట. అక్కడ స్టాలిన్ చెవులపై స్పీకర్లు పెట్టుకొని పార్టీ నాయకుల సంభాషణలు వింటున్నాడట. అప్పట్లో, ముఖ్య పార్టీ నాయకులందరూ క్రెమ్లిన్ లోనే ఉండేవారు. అంతే! బోరిస్ చడీ చప్పుడూ చెయ్యకండా, 1929లో కాలినడకన ఇరాన్ సరిహద్దులకి పారిపోయాడు. సోవియట్ పౌరులు ఎటువంటి భయాలతో బ్రతికేవారో ఈ కథ మూలంగా విశదమవుతుంది.
ఏ చిన్న సంభాషణైనా సరే.
ఎంత క్లుప్తమైన ముచ్చటైనా సరే
శరవేగంతో
క్రెమ్లిన్ కొండజాతి వాడికి
చేరితీర వలసిందే!
స్టాలిన్ కాకసస్ (Caucasus) పర్వతప్రాంతం నుంచి వచ్చాడు. కిరాతక సంతతివాడని ప్రతీక. అప్పట్లో క్రెమ్లిన్‌లో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ‘అనాగరిక’ సంతతివారు కాదని ఓసిప్ ధృవపరుస్తున్నాడు. గూఢచారులు ప్రతివ్యక్తి పైనా నిఘా వేసి ఉండేవారు. మేథావులపై నిఘా మరింత హెచ్చు.
వీడి జిడ్డువేళ్ళు బలిసిన పురుగులు
వీడి మాటలు సమ్మెట పోటుల్లా
తావుకి తటాలున తగులుతాయి.
1934లో ఓసిప్, బోరిస్ పాస్టర్నాక్ (Boris Pasternak) ఇంటికి వచ్చాడు. పదిమందిలో తన కవిత చదివాడు. (అప్పటికి ఇంకా అతన్ని జైలులో పెట్టలేదు) ఈ పని చెయ్యడం అవివేకమే! మాండిల్స్టామ్కి ఈ కవిత ప్రజల ముఖం చూడదని తెలుసు. అందుకనే వీలు దొరినప్పుడల్లా స్నేహితుల దగ్గిర కంఠస్థం చేసిన ఈ పద్యం వినిపించేవాడు. ఇంతకు పూర్వం ఒకసారి పాస్టర్నాక్కి మాస్కోలో రహస్యంగా ఈ చాటువు వినిపించాడు. పాస్టర్నాక్ సమాధానం: నీవు చదివిన పద్యానికి — సాహిత్యం తోటి, కవిత్వం తోటీ — ఏ విధమైన బాంధవ్యమూ లేదు. ఇది సాహిత్య ప్రక్రియ కాదు. ప్రాణహానికి సంబంధించిన ప్రక్రియ. దీనితో నాకే సంబంధమూ లేదు. నువ్వు నాకు ఏమీ వినిపించలేదు; నేను ఏమీ వినలేదు. ఈ పిచ్చిపని ఇంకెక్కడా చెయ్యకు.
స్టాలిన్ హయాములో, స్వితేవా (Marina Tsveteva), ఆఖ్మతోవా (Anna Akhmatova), పాస్తర్నాక్లు గౌరవించ దగిన సాహితీకారులు కాదు. మయకోవిస్కీ (Vladimir Mayakovsky) పార్టీ ప్రచార కవిగా పేరు తెచ్చుకున్నా, స్టాలిన్ ఉద్దేశ్యంలో బెయిద్నీ(Demian Beidny) ఒక్కడే ‘ప్రజాకవి.’ అతని దగ్గిరనుంచి స్టాలిన్ పుస్తకాలు తీసుకొని, చదివిన తరువాత తిరిగి ఇచ్చేవాడుట. డెమియన్ తన డైరీలో ‘జిడ్డు వేళ్ళు’ తన పుస్తకాలపై పడినట్టు ఉదహరించిన విషయం ఓసిప్కు తెలిసి ఉండాలి.
రష్యన్ మాటలు మెల్లి మెల్లిగా వత్తి వత్తి స్టాలిన్ పలికేవాడట. అతని రష్యన్ ఉచ్చారణ ’35 పౌండ్ల ఫిరంగి గుండ్ల’ బరువు కిందపడ్డ చప్పుడు చేసినట్టు ఉండేదని రష్యన్ మాతృక పదం. ఇక్కడ నేను సమ్మెటపోటులా అని అన్నాను; ఇంగ్లీషు అనువాదం ప్రకారం.
అనాగరికుడి ముసి ముసి నవ్వులు
వీడి బొద్దింక మీసాలు
దాపరికం లేకండా బట్టబయలు చేస్తాయి.
వీడి ఎత్తైన మిలిటరీ బూట్ల లోహపు బక్లీసులు
వెక్కిరిస్తూ మెరుస్తాయి.
కోర్నీ చుకావ్స్కీ (korney Chukovsky) రాసిన పిల్లల పద్యంలో పెద్ద పెద్ద మీసాలున్న బొద్దింక ఒక కౄరజంతువును భయపెడుతుంది. అప్పుడు ఒక చిన్న పిచ్చుక – ధైర్యవంతురాలైన ఒక చిన్న పిచ్చుక – ఒక్క గుటకలో బొద్దింకని స్వాహా చేస్తుంది. రష్యన్ పిల్లలందరికీ తెలిసిన కథ ఇది. ఇక్కడ స్టాలిన్ మీసాలని బొద్దింక మీసాలతో పోల్చడం హాస్యం కోసం అని చెప్పవచ్చు. ఆ పొడుగాటి హై టాప్ బూట్లు, ఆర్మీ కేన్వాస్ జాకెట్టు బోల్షెవిక్ నాయకులందరికీ యూనిఫారం అయ్యింది, లెనిన్ ధర్మమా అని! ఆ వేషం ప్రపంచనాయకుడికి సరైనది కాదని వ్యంగ్యం. (ఒకప్పట్లో ఇండియాలో స్టాలిన్‌లా మీసం పెంచుకొని, కేన్వాస్ జాకెట్ వేసుకొని తిరిగిన కమ్యూనిస్టులు లేకపోలేదు!)
చుట్టూ
వంకర మెడల ‘సర్దారులు,’
మరుగుజ్జుల అల్లరిమూక
సర్వదా పహరా వీడికి.
వీడికి బహుపరాక్.
ఒకడు మూలుగు తాడు, ఒకడు బుసకొడతాడు,
మరొకడు ఏడుపు, ఇంకొకడిది ఆర్తనాదం;
ఈ నీచులమధ్య దొంగనక్కలా
తిరుగుతూ ఉరుములా
చీదరించుకుంటాడు.
స్టాలిన్ తన చుట్టూ ఉన్న వందిమాగధులని ఎంత కౄరంగా, అలక్ష్యంగా హింసిస్తాడో ఓసిప్ వర్ణిస్తున్నాడు. (రష్యన్ భాష మాటల శ్రావ్యత అనువాదాల లోకి రాలేదని ప్రతి అనువాదకుడూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒప్పుకున్నారు.) ఈ చాటువు మొట్టమొదటి సారి విన్న వాళ్ళందరూ ముక్తకంఠంతో ఒప్పుకున్నారు: ఓసిప్ మాండిల్స్టామ్ను జైలులొ పడేయటం ఖాయం, ఆ తరువాత మరణశిక్ష తప్పదు, అని. కానీ, స్టాలిన్ ఓసిప్ని చెర్డిన్ నగరానికి పంపించాడు, ‘సర్కారీ బహిష్కరణ’ శిక్షగా! అంతేకాదు. అతని భార్య కూడా అతనితో చెర్డిన్ నగరానికి వెళ్ళటానికి అనుమతించాడు. ఆ తరువాత, ఇద్దరినీ, దక్షిణ రష్యాలో ఒక చిన్న కుగ్రామానికి పంపించాడు. రష్యన్ విమర్సకుడు బెనిడిక్ట్ సారనొవ్ (Benedict Saranov) రాసాడు: స్టాలిన్ తనకి అంకితం ఇస్తూ ఓసిప్ని పద్యం రాయమని అడిగాడట. స్టాలిన్‌కి తెలుసు; భవిష్యత్తులో రష్యనులు తనని గురించి పేరు మోసిన కవులు రాసింది తప్పక నమ్ముతారని! మాండిల్‌స్టామ్, 1937లో ఓడ్ టు స్టాలిన్ (Ode to Stalin అనే నీరసమైన కవిత ఒకటి రాశాడు. కానీ, ఓసిప్కి గూలాగ్లో మరణం తప్పలేదు
తీర్పు
తీర్పు పై మరొక తీర్పు
కమ్మరి కొలిమిలో సాగదీసిన
గుర్రపునాడాలు
వేగంగా విసిరినట్టు
విసురుతాడు,
ఒకటి పొట్టమీదకి, వేరొకటి నుదుటి మీదకి
మరొకటి కనుబొమ్మపై, మరొక్కటి కంటిలోకి.
ప్రతి ఉరిశిక్ష
వీడి ఓసీటియన్ గుండెని
ఉల్లాసంగా నింపే
ఒక మహోత్సవం.
(స్టాలిన్ కాకసస్ పర్వత ప్రాంతం నుంచి వచ్చాడని కదా చెప్పుకున్నాం. ఆ పర్వతాలలో ఒసీటియా అనే ప్రాంతానికి చెందిన ఇరానియన్ తెగ వారిని ఓసీటియన్లు అని పిలుస్తారు.)
మాండిల్‌స్టామ్ విషయంలో స్టాలిన్ స్వయంగా జోక్యం కల్పించుకొని పాస్టర్నాక్ని పిలిచాడట. మాండిల్‌స్టామ్ గురించి సోవియట్ రచయితల సంఘం ఎందుకు తన దగ్గిరకి రాయబారానికి రాలేదు? అని స్టాలిన్ అడిగితే, 1927 నుంచీ రచయితల సంఘం ఇటువంటి విషయాలలో జోక్యం కల్పించుకోవటల్లేదని పాస్టర్నాక్ చెప్పాడు. ఈ విషయమై, నేను ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని ఉన్నది అని పాస్టర్నాక్ అనంగానే, స్టాలిన్ టెలిఫోను పెట్టేశాడట!
బ్లోక్ (Alexander blok) లాగా, మయకోవ్‌స్కీ లాగా సోవియట్ రష్యా విప్లవాన్ని అందలానికెత్తుతూ, గుండెలు బాదుకుంటూ, గర్జన కవితలు మాండిల్‌స్టామ్ రాయలేదు. రాయలేడు కూడాను! అయితే ఊరికే కూర్చొనీ ఉండలేదు. 1934 లోనే మాండిల్‌స్టామ్ కనిపెట్టాడు; స్టాలిన్ హయాములో, రష్యాలో నిరంకుశత్వం పాతకాలపు జార్ల నిరంకుశత్వాన్ని మించిపోయిందని. అందుకనే కాబోలు; తన జీవితానికి ముప్పు వస్తుందని తెలిసికూడా, స్టాలిన్ మీద వ్యంగచాటువు రాసి, అందరికీ వినిపించాడు.
శిక్ష వేస్తున్న జడ్జీకి చేతిరాత ప్రతి ఇచ్చాడు; అప్పటివరకూ ఆ కవిత అచ్చు కాలేదన్న మాట!
ప్రసిద్ధికెక్కిన ఆక్మెయిస్ట్ (#acmeist#) కవిగా అతను రాసిన పుస్తకాలు, కావ్యాలు, వ్యాసాలూ అతను బ్రతికిన రోజుల్లో అచ్చులో చూసుకోలేక పోయాడు. ఇటువంటి దుస్థితి, నిరంకుశ ప్రభుత్వాలు ఉన్న రష్యా, చైనా లలోనే కనిపిస్తుంది.
ఈ మధ్యకాలంలో, స్టాలిన్ మీద, మావో గురించీ చాలా పరిశోధన గ్రంధాలు, విమర్శలూ వచ్చాయి. వీళ్ళ పరిపాలనా కాలంలో మరణించిన వాళ్ళ సంఖ్యలు చూస్తే, (ఈ పరిశోధకులు బేరీజు వేసిన సంఖ్యలో సగం నిజమైనా!) గుండె బేజారెత్తిపోతుంది. హత్యాకాండకి సంబంధించినంత వరకూ, వీళ్ళ ఇద్దరి ముందూ, హిట్లర్ నిజంగా ఒక పసికూనే!
1. రష్యన్ మాతృక సిరిలిక్ లిపిలో (పక్కన ఇంగ్లీష్‌లో ప్రతిలేఖన.)
Мы живем, под собою не чуя страны, Наши речи за десять шагов не слышны, А где хватит на полразговорца, Там припомнят кремлевского горца. Его толстые пальцы, как черви, жирны, И слова, как пудовые гири, верны, Тараканьи смеются глазища И сияют его голенища. My zhivem, pod soboju ne chuja ctrany, Nashi rechi za desjat’ shagov ne slyshny, A gde hvatit na polrazgovorca, Tam pripomnjat kremljovskogo gorca. Ego tolstye pal’cy, kak chervi, zhirny, A slova, kak pudovye giri, verny, Tarakan’i smejutsja usishha, I sijajut ego golenishha.
А вокруг него сброд тонкошеих вождей, Он играет услугами полулюдей. Кто свистит, кто мяучит, кто хнычет, Он один лишь бабачит и тычет.Как подкову, дари’т за указом указ — Кому в пах, кому в лоб, кому в бровь, кому в глаз. Что ни казнь у него — то малина И широкая грудь осетина. A vokrug nego sbrod tonkosheih voҗdej, On igraet uslugami poluljudej. Kto svistit, kto mjauchit, kto hnychet, On odin lish’ babachit i tychet, Kak podkovu, kuet za ukazom ukaz: Komu v pah, komu v lob, komu v brov’, komu v glaz. Chto ni kazn’ u nego—to malina I shirokaja grud’ osetina.
2. ప్రెయిటో స్పానిష్, ఆండర్సన్ ఇంగ్లీష్ అనువాదాలు
EPIGRAMA CONTRA STALIN
STALIN EPIGRAM
Vivimos sin sentir el país a nuestros pies, nuestras palabras no se escuchan a diez pasos. La más breve de las pláicas gravita, quejosa, al montañes del Kremlin. Sus dedos gruesos como gusanos, grasientos, y sus palabras como pesados martillos, certeras. Sus bigotes de cucaracha parecen reír y relumbran las cañas de sus botas. We live, not feeling the earth beneath us At ten paces our words evaporate. But when there’s the will to crack open our mouths our words orbit the Kremlin mountain man. Murderer, peasant killer. His fingers plump as grubs. His words drop like lead weights. His laughing cockroach whiskers. The gleam of his boot rims.
Entre una chusma de caciques de cuello extrafino él juega con los favores de estas cuasipersonas. Uno silba, otro maúlla, aquel gime, el otro llora; sólo él campea tonante y los tutea. Como herraduras forja un decreto tras otro: A uno al bajo vientre, al otro en la frente, al tercero en la ceja, al cuarto en el ojo. Toda ejecución es para él un festejo que alegra su amplio pecho de oseta. Around him a circle of chicken-skinned bosses sycophantic half-beings for him to toy with. One whines, another purrs, a third snivels as he babbles and points. He forges decrees to be flung like horseshoes at the groin, the face, the eyes. He rolls the liquidations on his tongue like berries delicacies for the barrel-chested Georgian.
----------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు,
ఈమాట సౌజన్యంతో
1 comment:
Post a Comment