ఏయే వేశ్యగణంబు నారసితి.......(పేరడీ)
సాహితీమిత్రులారా!
ఒక పద్యానికి లేదా పాటకు వ్యంగ్యంగా వ్రాసిన
మరోపద్యం లేదా పాటను పేరడీ అంటారు.
ఈ పద్యం విష్ణుభట్ల సుబ్రమణ్యేశ్వరులచే కూర్చబడి
1906 లో ముద్రితమైన దుర్మార్గచరిత్ర(A Fool and His family)లోని-
ఏయే వేశ్యగణంబు నారసితి రేయే శిష్టులం దిట్టినా
రేయే కొంపలయందుఁజిచ్చిడితి రేయే చెర్వులంబూడ్చినా
రేయే దారుల కంపఁగొట్టితిరి, యేయే తోటలం బీకినా
రాయాదుష్టవిదుష్ట చేష్టలను భ్రష్టానాకుఁజెప్పంగదే
(దుర్మార్గచరిత్ర-పుట-79- పద్యం-80)
ఈ పద్యం ఈ క్రింది పద్యానికి పేరడీ-
ఏయే దేశములన్వసించితిరి మీ రేయే గిరుల్ చూచినా
రేయే తీర్థములందుఁగ్రుంకిడితిరేయేద్వీపముల్ మెట్టినా
రేయే పుణ్యవనాళిఁ ద్రిమ్మరితి రేయే ేబయధుల్ డాసినా
రాయా చోటులఁ గల్గు వింతలు మహాత్మా నా కెఱింగింపవే
(మనుచరిత్ర - 1 -26)
6 comments:
మంచి సమాచారం.
>>>>రామమందిరం శంఖుస్థాపన రాహుకాలంలో చేశారేమిటీ? అలా చేయవచ్చా?......
>>>రాహువు గంగలో కలవనీ నీకేంటి బాధ?
పట్టువదలని విక్రమూర్ఖురాలు మరో ప్రశ్న వదిలింది....
నీ ఇష్టం వచ్చిన కుర్ర హీరోని ఎంచుకుని వాడి ఉపాసన చెయ్యి... Hilarious
సంసకారం ఉన్నవాడికి కదా సంస్కార నాశనం ....
ఇక్కడి మాటలు అక్కడా అక్కడి మాటలు ఇక్కడా చేరవెయ్యడం మానుకో>>>>>>
WONDERFUL
Post a Comment