Wednesday, September 23, 2020

సర్వలఘు చిత్రం

 సర్వలఘు చిత్రం




సాహితీమిత్రులారా!




శ్రీహర్షుని  నైషధంలోని ఈ శ్లోకం చూడండి.

ఇందులో అన్నీ లఘువులే అందువల్ల దీన్ని

సర్వలఘుచిత్రం అంటారు.

నలదమయంతులు వివాహానంతరపు శ్లోకం ఇది.



శుచిరుచిముడు గణమగణనమముమతి

కలయసి కృశతను నగగనతటమను

ప్రతినిశ శశితల విగలదమృతభృత

రవిరథ హయచయ ఖురబిల కులమివ

                                     (శ్రీహర్ష నైషధము - 22-146)



ఓ కృశాంగీ!  ఆకసపు ప్రదేశమున తెల్లనికాంతి కలిగినదై ఎక్కువగా

ఉండుటవలన లెక్కింప సాధ్యము కానిదై కేవలము వ్రేలితో చూపదగి

ప్రత్యక్షగమ్యమై ఉండు నక్షత్రగణమును ప్రతిరాత్రీ చంద్రుని

దిగువభాగమునుండి స్రవించు తెల్లని అమృతముచే నిండిన

సూర్యాశ్వముల గిట్టల రంధ్రముల యొక్క సమూహముగా భావింపుము.

ప్రతిరాత్రీ చంద్రుని నుండి స్రవించే తెల్లని అమృతముతో నిండిన సూర్యుని

గుఱ్ఱము గిట్టల రంధ్రములు నక్షత్రములవలె శోభించుచున్నవి- అని భావం.

No comments: