Thursday, September 24, 2020

''తిరుకాళత్తి'' కి సంక్షిప్తమైన పేరు తిక్కన

''తిరుకాళత్తి'' కి సంక్షిప్తమైన పేరు తిక్కన





సాహితీమిత్రులారా!



కపిలవాయి లింగమూర్తి వారి 

ఆర్యా శతకంలోని పద్యం


సూత్రపడ ప్రాత క్రొత్తలు

ధాత్రిని వృద్దాదిపంక్తి దనరిన యజ్వన్

పాత్రున్ తిక్క మనీషిత్రి

నేత్రున్ కవి పద్మభవు గణించెద నార్యా


తిక్కన తండ్రి కొమ్మనమంత్రి. ఆయన మనుమసిద్ధి ఆస్థానంలో

ఉండేవాడు. అతని తండ్రిపేరు తిరుకాళత్తి విభుడు. ఆనాటి మంత్రులకు తమసంతానానికి తమ ప్రభువుల పేర్లు, వారి తండ్రులపేర్లు పెట్టుకునే ఆచారం కాబట్టి కొమ్మన తన కుమారునికి తిరికాళత్తి పేరుకు సంక్షిప్తమైన తిక్కన అనే పేరును తనకుమారునికి పెట్టుకున్నాడని చారిత్రకుల అభిప్రాయం.

అలాగే కొందరు పండితులు తిగ + కన్ను = అనే ఈశ్వరవాచకం నుండి సాధించినారు. తిగకన్న ప్రాతాది సూత్రంలో గకారలోపం క్రొత్త శబ్దం కనకనే సూత్రంతో కకారానికి ద్విత్వం కలిగి తిక్కన్ను కాగా అది వృద్దాదిగణంలో చేరినదై తర్వాత ఉత్వం లోపించి అకారాంతంగా నిలిచి తిక్కన అయిందని తమాషాగా ఒకపుడు సాధించినారు కాని ఇది నిజంకాకున్నా ఇందులో చమత్కారావహమైన ఒక ప్రక్రియ చూపబడింది.

తిక్కనకు కవిబ్రహ్మ అనే బిరుదున్నా ఆయన శివుని వంటి వాడని చెప్పడం ఈ పండితుల అభిప్రాయం.

No comments: