Saturday, September 5, 2020

ఆదిభట్లవారి సత్యవ్రత శతకము

 ఆదిభట్లవారి సత్యవ్రత శతకము




సాహితీమిత్రులారా!

Adibhatla Narayana Das, a versatile genius and doyen of Harikatha

విజయనగరం మహారాజుగారైన ఆనందగజపతి

ఒకరోజు సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్  అనే

ఒక సమస్యను ఇచ్చి  శతకం వ్రాయవలసినదిగా చెప్పారట

దానికి అనేకులు ప్రయత్నించారు వారిలో మన

అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు కూడ ఒకరు

దీనికి మన దాసుగారు సత్యవ్రత శతకము అని పేరు పెట్టారు.

ప్రతిపాదం చివరలో ఆ సమస్యను వచ్చేలా పూర్తి చేయడం జరిగింది.

అందులోని కొన్ని పద్యాలు.................

 ఇది కందపద్య శతకం.


1. హితమితవాక్సంతితికిన్ 

    దతభూతదయానురతికి ధైర్యోన్నతికిన్ 

    జతురమనీషాగతికిన్

    సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్


2. గతకిల్బిష వ్రతతతికిన్

    జ్యుతదుర్జన సంగతికిని సూనృతమతికిన్

    శ్రితరక్షణానురతికిన్

    సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్


3. స్తుతిదగు ధర్మనిరతికిన్

    స్వతంత్ర సంచారధీర వసుధాపతికిన్

    బ్రతుకేల యనృతమతికిన్

    సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్


4. అతుకు బ్రతు కనృతమతికిన్

    స్వతంత్ర పరిజీవనంబు శౌర్యస్థితికిన్

    బతిపరిచర్యలు సతికిన్

    సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్


చివరి పద్యం-

100. చతురుకళా విద్యాసం

        గతికిన్ స్థిరధృతికిఁ బ్రకట కరుణామతి కి

        క్కృతి యానందగజపతికి

        సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్

No comments: