Wednesday, September 30, 2020

పెదిమలు తగిలి తగలని పద్యం

 పెదిమలు తగిలి తగలని పద్యం




సాహితీమిత్రులారా!



పెదవితో పలికే హల్లు(అక్షరం),

పెదవితో పలకని హల్లు(అక్షరం)

ఈ విధంగా ఒకదాని తరువాత ఒకటి కూర్చితే

అది సౌష్ఠ్యనిరోష్ఠ్య (ఓష్ఠ్యనిరోష్ఠ్య) సంకర చిత్రం అవుతుంది.

ఈ శ్లోకం చూడండి.

భోగి భోగాభోగభూరే పుణ్యేముక్తే: వురేవుషి

భూరి బోధముదం భూతిం పుష్యభోన: పున: పున:

                    (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం-23)

(ఓ రంగనాథా మాకు జ్ఞానానందాన్నీ,

ఐశ్వర్యాన్నీ ఇచ్చి మాటిమాటికీ పుష్టిని ఇమ్ము.)

ఈ శ్లోకంలో ఒక ఓష్ఠ్యాన్ని, ఒక నిరోష్ఠ్యాన్నీ క్రమంగా

ఒకదాని తరువాత ఒకటిగా కూర్చారు.

అంటే శ్లోకంలోని 32 అక్షరాల్లో 16 ఓష్ఠ్యాక్షరాలు,

16 నిరోష్ఠ్యాక్షరాలు ఉన్నాయి గమనించండి.


No comments: