Friday, November 27, 2020

రెండు ప్రశ్నలకు సమాధానము ఒకటే

 రెండు ప్రశ్నలకు సమాధానము ఒకటే





సాహితీమిత్రులారా!


పొడుపుపద్యంలో పాదానికి రెండు ప్రశ్నలున్నాయి

రెండిటికి ఒకేసమాధానం కనిగొనాలి గమనించండి-


రాజులకెటువంటి రత్నముల్ ప్రియమయ్యె

రాయలే చెట్లవి కరులుమ్రింగు

నీశ్వరుఁడెవ్వాని నెచ్చోట ధరియించు

జారుఁడే ప్రొద్దునెవ్వారిఁగోరు

నెన్నెన్ని దినములకుకేతెంచు పున్నమ

జనయిత్రి పుత్రియేజాడఁదోఁచు

బంధువులేయెడ బలసియేతెంతురు

యీతగాఁడెందున భీతిఁజెందు

నన్నిటికి, జూడనైదేసి యక్షరములు

తిఱిగిచదివిన నాపేరె మఱలవచ్చు

రెండుప్రశ్నలకొక్కటేరీతినుండు

సమ్మతిగఁజెప్ప భావజ్ఞచక్రవర్తి


దీనిలో ప్రతి పాదంలో రెండు ప్రశ్నలున్నాయి

వాటికి ఒకటే సమాధానం 5 అక్షరాలలో ఉండాలి

మరియు 

ఎటు చదివినా ఒకలాగే ఉండాలి

ఇవి షరతులు-

మరి సమాధానాలు

రాజులకెటువంటి రత్నముల్ ప్రియమయ్యె

రాయలే చెట్లవి కరులుమ్రింగు

సమాధానం- వెలగలవె  

నీశ్వరుఁడెవ్వాని నెచ్చోట ధరియించు

జారుఁడే ప్రొద్దునెవ్వారిఁగోరు

సమాధానం- నెలతలనె 

నెన్నెన్ని దినములకుకేతెంచు పున్నమ

జనయిత్రి పుత్రియేజాడఁదోఁచు

సమాధానం- నెలనెలనె  

బంధువులేయెడ బలసియేతెంతురు

యీతగాఁడెందున భీతిఁజెందు

సమాధానం-నెగడగనె


No comments: