ప్రేయసీ - ప్రియుల సంభాషణ
సాహితీమిత్రులారా!
ప్రేయసి - ప్రియుల సంభాషణ చూడండి
ప్రాణప్రేయసి! మా పిబంతు పురుషా: పిత్తజ్వరవ్యాకులా:
నానావల్లిజలం విలంబితఫలం పానే విషాదప్రదమ్
తత్తై: కిం క్రితాం చిక్సకపతే! ముగ్దే సుఖం సేవ్యతాం
సద్యస్తాపహరస్సుధాధికతర: కాంతాధర: కేవలమ్
(లోలంబరాజీయమ్)
ప్రియుడు- ప్రాణప్రేయసి! మా పిబంతు పురుషా: పిత్తజ్వరవ్యాకులా:
నానావల్లిజలం విలంబితఫలం పానే విషాదప్రదమ్
తత్తై:
(ఓ ప్రియురాలా పురుషులకు పైత్యజ్వరం వచ్చి బాధపడుతున్నపుడు
అనేకరకాల మూలికలతో తయారుచేసినది, ఆలస్యంగా ఫలితాన్నిచ్చేది,
త్రాగేప్పుడు వగరుగా ఉండి చికాకు కలిగించేది. అయిన కషాయాన్ని తాగవద్దు)
ప్రేయసి - కిం క్రితాం చిక్సకపతే!
(అయితే వారేం చేయాలి?)
ప్రియుడు - ముగ్దే సుఖం సేవ్యతాం
సద్యస్తాపహరస్సుధాధికతర: కాంతాధర: కేవలమ్
(ఏమీలేదు. వెంటనే తాపాన్ని హరించేదీ, అమృతంకంటే ఎక్కువ రుచిగా
ఉండేదీ అయిన తన ప్రియురాలి అధరామృతం ఆస్వాదిస్తే చాలు.
వెంటనే అతని పైత్య జ్వరం నిమ్మళిస్తుంది)
No comments:
Post a Comment