Tuesday, April 19, 2022

అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం

 అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం




సాహితీమిత్రులారా!



పద్యంలోని ప్రశ్నలన్నిటికి సమాధానం 

ఒకటేగా ఉండే పద్యం-


సూర్యభగవాను పట్టపు భార్య యెవతె?

నీతిలేని యుద్యోగి చింతించునెద్ది?

బాటనెదిగోరి వృక్షముల్ నాటుచుంద్రు?

దాని చాయ యటన్న ఉత్తరముగాదె


ఇందులో మూడు ప్రశ్నలున్నాయి వాటి మూడిటికి

సమాధానం ఒకటే గా ఉండునట్లు సమాధానం చెప్పాలి

సూర్యుని భార్య పేరు

నీతిలేని ఉద్యోగి దేని కోసం ఆలోచిస్తుంటాడు

బాటలకు ఇరువైపులా చెట్లను నాటుతారు ఎందుకు

ఈ మూడింటికి సమాధానం కవి చివరి పాదంలో

సమాధానం ఇచ్చారు - 

సమాధానం - చాయ

మొదటిదానికి - ఛాయాదేవి

రెండవదానికి - చాయ (టీ)

మూడవదానికి - చాయ (నీడ)

Sunday, April 17, 2022

కపిలవాయిగారి పొడుపు పద్యం

 కపిలవాయిగారి పొడుపు పద్యం




సాహితీమిత్రులారా!



ఈ పద్యం కపిలవాయి లింగమూర్తి గారి పొడుపు పద్యం

గమనించండి-


వానర బలమెల్ల వార్ధి యేమిట గట్టె?

వైరులు పైకెత్తు వడువు నేది?

అంబుధి దరువగా నందు బుట్టినదేమి?

అవని యహల్య నేమగుచు బడియె?

హరి పవ్వళించిన ఆకు వృక్షంబేది?

పశుపతి నేతీరు ప్రజలు గనిరి?

శంభుని జడలోన చెలగినిలిచినదేమి?

ఆననంబునకేమి అందమయ్యె?

అన్నిటికి జూడ రెండేసి యక్షరములు

ఆదిమాత్రం యందున హర్షముగను

కలుగ గుండాల రాముండు కరుణతోడ

మనల కరుణా విధేయుడై మనుచుచుండు



సమాధానాలు -

వానర బలమెల్ల వార్ధి యేమిట గట్టె       - గుండ్లు

వైరులు పైకెత్తు వడువు నేది               - డాలు

అంబుధి దరువగా నందు బుట్టినదేమి   - లక్ష్మి

అవని యహల్య నేమగుచు బడియె      - రాయి

హరి పవ్వళించిన ఆకు వృక్షంబేది       - మఱ్ఱి

పశుపతి నేతీరు ప్రజలు గనిరి             - లింగం

శంభుని జడలోన చెలగినిలిచినదేమి    - గంగ

ఆననంబునకేమి అందమయ్యె           - ముక్కు


Friday, April 15, 2022

ముక్తపదగ్రస్తము అంటే వినిపించే పద్యం

 ముక్తపదగ్రస్తము అంటే వినిపించే పద్యం




సాహితీమిత్రులారా!



ముక్తపదగ్రస్తమంటే వెంటనే వినిపించే

పద్యం సుదతీ నూతన మదనా

ఈ పద్యం నరసభూపాలీయంలోనిది


సుదతీ నూతన మదనా!

మదనాగతురంగ మణిమయ సదనా!

సదనామయగజరద నా

రదనాగేంద్ర నిభ కీర్తిరస! నరసింహా!

                                                                 (నరసభూపాలీయము - 4-82)

దీని పాదాంతాల్లోని పదాలు విడిచి మళ్ళీ గ్రహించడం వల్ల దీనికి

పాదాంత ముక్తపదగ్రస్తమంటారు

సుదతీ - సుందరమణులపాలిటి

నూతన మదనా - కొత్త మన్మథుడా

మదనాగ - మదించిన ఏనుగులతో

తురంగ - గుర్రాలతో

పూర్ణ మణిమయ - రత్నాలతో మణులతో నిర్మితమైన

సదనా - రాజసౌధంకలవాడా

సత్ - నక్షత్రాలు

అనామయ గజ - దేవతల ఏనుగైన ఐరావతము

రద - దంతాలు

నారద - దేవర్షి నారదడూ

నాగేంద్ర - ఆదిశేషుడూ

నిభ - వీటితో సరివచ్చే

కీర్తిరస - యశస్సు కలవాడా

నరసింహా - ఓ నరసింహభూపతీ

Wednesday, April 13, 2022

సింహావలోకన ముక్తపదగ్రస్తం(హిందీ)

 సింహావలోకన ముక్తపదగ్రస్తం(హిందీ)




సాహితీమిత్రులారా!



ముక్తపదగ్రస్తం అంటే విడిచిన పదాన్ని మళ్ళి తీసుకోవడం

మొదటి పాదం మొదట్లో వదలిన పదాన్ని మళ్ళీ చివరి పదం చివర

తీసుకుంటే దాన్ని సింహావలోకన ముక్తపదగ్రస్తం అంటారు

మహాకవి దేవదత్త కృత శబ్దరసాయన లోని 

సింహావలోకన ముక్తపదగ్రస్తం ఇక్కడ గమనిద్దాం


दूल है सुहाग दिन, तूल है तिहारे तिन

దూల్ హై సుహాగ్, తూల హై తిహారే తిన్

          तूल है तिहारे, सो अयान ही की भूल है,

          తూల్ హై తిహారే, సో అయాన్ హీ కీ భూల్ హై

भूल है न भाग की, प्रवाह सो दुकूल है

భూల్ హై భాగ్ కీ, ప్రవాహ్ సో దుకూల్ హై

           दुकूल है उज्यारो, देव प्यारो अनुकूल है

            దుకూల్ హై ఉజ్యారో, దేవ్ ప్యారో అనుకూల్ హై

कूल है नदी को, प्रतिकूल है गुमान री

కూల హై నదీ కో, ప్రతికూల్ హై గుమాన్ రీ

            अहूल है सुजौन, जौन जोबन अहूल है

             అహూల్ హై సుజౌన్, జౌన్ జోబన్ అహూల్ హై

हूल है हिये मैँ . हिय हू लहै न चैन री

హూల్ హై హియే మైఁ, హియ్ హూ న చైన్ రీ

             बिहारु पल दुल है, निहारु पल दूल है।

              బిహారు పల్ హై నిహారు పల్ దూల్ హై 

Friday, April 8, 2022

పొడుపు పద్యాలు

 పొడుపు పద్యాలు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యాలకు విడుపు

చెప్పగలరేమో గమనించండి-

కాళ్లు లేవుగాని కరములు రెండుండు

మెడయు వీపు కడుపు నడుము గల్గి

శిరము లేక తాను నరులను దిగమ్రింగి

యొప్పుఁ గూర్చు దీని విప్పడయ్యె



సమాధానం - దీనికి కాళ్లుండవు చేతులుంటాయి

                 మెడ వీపు  కడుపు నడుము ఉంటాయి

                 తల ఉండదు కానీ మనుషులను దిగమింగేస్తుంది

                 అంటే చొక్కా



Wednesday, April 6, 2022

పైకి క్రిందికి ఎలా చదివినా మారని పద్యం

పైకి క్రిందికి ఎలా చదివినా మారని పద్యం




సాహితీమిత్రులారా!



పైనుండి క్రిందికి చదివినా క్రిందినుండి పైకి చదివినా

పద్యం ఏ మార్పులేకుండా అలాగే ఉండేవిధంగా కూర్చిన 

పద్యం ఇది ఇది నారపరాజు కాంతకవి కూర్చిన 

కవిజనచకోరచంద్రోదయం లోనిది. కావ్యాంతంలో

కృతిపతి అయిన రంగనాథుని గూర్చిన సంబోధలు

ఈ పద్యం-


సారసనయనా వనచర

సార వరాహా కనకదశ వితత రామా

మారాతత విశద కనక

హారా వరసారచన వనాయన సరసా


ఈ పద్యాన్ని మొదటినుండి చివరకు చివరనుండి 

మొదటికి చదివి చూడండి పద్యం మార్పు చెందుతుందేమో

 

Monday, April 4, 2022

రామాభ్యుదయమ్ లోని ఏకాక్షర, ద్వ్యక్షర పద్యాలు

 రామాభ్యుదయమ్ లోని ఏకాక్షర, ద్వ్యక్షర పద్యాలు




సాహితీమిత్రులారా!

సంస్కృతంలో కూర్చబడిన రామాభ్యుదయమ్ లో కూర్చిన

ఏకాక్షర, ద్వ్యక్షర పద్యాలు గమనించండి-


ఏకాక్షరి - క కారంతో కూర్చబడినది

కౌకః కుకాం కుకే కాఙ్కకాకికాకో కకిం కకీ 

కైకాం కికే కకుం కౌకః కుకా కాక కకీః కుకః

                                                             (రామాభ్యుదయమ్ - 19 - 61)


ద్వ్యక్షరి -  ధ - ర అనే హల్లులతో కూర్చబడినది

ధీరధారాధరాధారరాధారోధధురాధురః

ధరాధరరోరోరోధారోధీరారారుధరాధరః

                                                                          (రామాభ్యుదయమ్ - 19-65)