బ్రతికుండే గోతిలో కూర్చుండేవాడు
సాహితీమిత్రులారా!
ఈ పొడుపుకథను
విచ్చండి -
1. చలి లేక నిప్పులో కాగేవాడు
తాపంలేక చెరువులో నానేవాడు
బ్రతికుండే గోతిలో కూర్చుండేవాడు
ఏ వూళ్లో బడితే ఆ వూళ్లో వుండేవాడు
వీరెవరో విప్పండి చెప్పండి?
సమాధానం -
చలి లేక నిప్పులో కాగేవాడు - కంసాలి
(చలితో పనేముందీ ఎప్పుడూ
కొలిమి దగ్గరుంటాడుకదా)
తాపంలేక చెరువులో నానేవాడు - జాలరి
(జాలరి కి తాపంతో ఏం పని నీటిలో
దిగి చేపలు పడుతుంటాడు కదా)
బ్రతికుండే గోతిలో కూర్చుండేవాడు - సాలె
(సాలెవానికి మగ్గంతో పనికదా
మగ్గం గుంటలో వుంటాడుకదా)
ఏ వూళ్లో బడితే ఆ వూళ్లో వుండేవాడు - చాకలి
2. అనగా అనగా ఒక గచ్చు మేడ
గచ్చుమేడ మీద చెక్క మేడ
చెక్క మేడ ముందు కంచు మేడ
కంచు మేడలో మత్యాల మేడ
ముత్యాల మేడలో అయిదుగురు నాట్యం
ఏమిటో చెప్పండి?
సమాధానం -
అనగా అనగా ఒక గచ్చు మేడ - నేల
గచ్చుమేడ మీద చెక్క మేడ - పీట
చెక్క మేడ ముందు కంచు మేడ - పళ్లెం
కంచు మేడలో మత్యాల మేడ - అన్నం
ముత్యాల మేడలో అయిదుగురు నాట్యం - వేళ్లు
No comments:
Post a Comment