బ్రహ్మలనక బంటులనక బంతిని భోంచేసిరంట
సాహితీమిత్రులారా!
ఈ పొడుపుకథను
విచ్చండి-
1. నల్లనల్లని పక్షికి నడినెత్తిన రెక్కలొచ్చె, చేతులార గోళ్ళు వచ్చె
చెవుల సందున కొమ్మలొచ్చె, దాని పచ్చ రత్నాలు కత్తిన కోసి,
బ్రహ్మలనక బంటులనక బంతిని భోంచేసిరంట.
ఏమిటో చెప్పండి?
సమాధానం - అరటిచెట్టు
2. నల్లని అడవి; ఆ అడవిలో తెల్లని దారి;
ఆదారి దాటితే రెండు అగ్నిగోళాలున్నవి;
అవి దాటితే ఒక వంతెన ఉంది;
అది దాటితే ఒక కోట ఉంది;
ఆ కోట ద్వారాలు తెరిస్తే నెమలి నాట్యం చేస్తుంది
ఏమిటో చెప్పండి?
సమాధానం -
నల్లని అడవి - తల
ఆ అడవిలో తెల్లని దారి - పాపట
ఆదారి దాటితే రెండు అగ్నిగోళాలున్నవి - కన్నులు
అవి దాటితే ఒక వంతెన ఉంది - ముక్కు
అది దాటితే ఒక కోట ఉంది - నోరు
ఆ కోట ద్వారాలు - పెదవులు
తెరిస్తే నెమలి నాట్యం చేస్తుంది - నాలుక
No comments:
Post a Comment