ఏకాక్షర కందములు
శబ్దచిత్రంలో ఒకే హల్లును ఉపయోగించి
కూర్చిన కందపద్యాలు ఏకాక్షర కందపద్యాలు
వీటిలో అచ్చులుమాత్రం ఏవైనా ఉపయోగించవచ్చు
కాని హల్లు ఒకటే ఉంటుంది చూడండి-
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని 223వ పద్యం
లోలాళిలాలిలీలా
ళీలాలీలాలలేలలీలలలలులే
లోలోలైలాలలల
ల్లీలైలలలాలలోలలేలోలేలా
(ఇందులో ల-ళ లకు భేదము లేదు కావున పద్యమంతా
ల - అనే హల్లుతో కూర్చబడినదిగా భావించాలి)
లోల - చలించుచున్నట్టి, అళి - తుమ్మెదలను,
లాలి - లాలించునట్టి, లీలా - శృంగారక్రియగలిగినట్టి,
ఆళీ - చెలికత్తెలయొక్క, లాలీ - లాలిపాటలయొక్క,
లాల - లాలయను పాటయొక్క, ఏల - ఏలపదాలయొక్క,
లీలలు - విలాసములు, అలలు - అతిశయములు,
లే - అవులే, లోలో - లోలోయనే, ల - స్వీకరించయోగ్యమయినట్టి,
ఐల - గుహలయందు, అల - అఖండములయినట్టి,
లలత్ - కదలుచున్నట్టియు, లీల - క్రీడార్థమయినట్టియు,
ఏలల - ఏలకీతీగలయొక్క, లాల - ఉయ్యాలలు,
ఓలలు - హేరాళములే, లోల - ఆసక్తిగలిగిన,
ఐలా - భూదేవిగల శ్రీవేంకటేశ్వరస్వామీ
నానాననునిననూనున
నేను నిను ననున్ను నెన్న నీనీననిను
న్నానొని న నోన్ని నానౌ
నేనే నను నన్నునాన నేనను నన్నన్
(వరాహపురాణము- 10- 90)
నేను నిను ననున్ను నెన్న నీనీననిను
న్నానొని న నోన్ని నానౌ
నేనే నను నన్నునాన నేనను నన్నన్
(వరాహపురాణము- 10- 90)
నిన్ను నిను నెన్న నీనే
నెన్నిన నన్నన్న ననననిన నానే నా
నిన్నూని నా ననూనున్
నన్నూనన్నాను నేననా నున్నానా
శ్రీవేంకటేశ చిత్రరత్నాకరం పూర్వభాగంలోనిది.
అనిన = నీకుపైన ప్రభువులులేని, నానా = సర్వమునకు, ఇనా = ప్రభువైనవాడా, ఇనున్ = సర్వేశ్వరుడవైన, నిన్నున్, ఎన్నన్ = స్తుతించుటకొరకు, ఈనేను, ఎన్నినన్ = ఆలోచించినచో, ననను = చిగురును, (అల్పుడని అర్థం), అన్నన్న= చోద్యం, అనూనున్ = గొప్పవాడవైన,
నినున్ = నిన్ను, ఊనినాను = ఆశ్రయించినాను, నున్న = త్రోసివేయబడిన, అనా = శకటముగలవాడవైన, అనా = తండ్రీ, నేను, నన్ను+ ఊను = ఆదుకొనుము,
అన్నాను = అంటిని.
నినున్ = నిన్ను, ఊనినాను = ఆశ్రయించినాను, నున్న = త్రోసివేయబడిన, అనా = శకటముగలవాడవైన, అనా = తండ్రీ, నేను, నన్ను+ ఊను = ఆదుకొనుము,
అన్నాను = అంటిని.
నేనని నూని నను నిన్ను నేనన్నను నా
నా నేనను నున్ననో నా
నేనె ననున్నాను నెన్న నీనను నానన్
(శ్రీకువలాశ్వ విజయము5-69)
(ఇందులో మూడవ పాదంలో గణభంగం జరిగినది
ముద్రణా దోషము కావచ్చు)
మామా! మిమ్మొమ్ము మామ మామా మేమా
మేమొమ్మము మీ మైమే
మేమే మమ్మోము మోము మిమ్మౌ మౌమా!
(చంపూ భారతం పుట. 249 )
మా = చంద్రుని యొక్క, మా = శోభ,
మోము + ఔ = ముఖముగా గల,
మామా- మా = మాయొక్క, మా = మేధ,
మిమ్ము = మిమ్ములను, ఒమ్ము =-అనుకూలించును,
మామమామా = మామకు మామవైన దేవా!,
ఆము = గర్వమును, ఏమి =- ఏమియు,
ఒమ్మము = అంగీకరించము, మీమై = మీ శరీరము,
మేము ఏమే = మేము మేమే, మమ్ము,
ఓ ముము + ఓముము = కాపాడుము, కాపాడుము,
ఇమ్ము = అనుకూలము, ఔము = ఔమా + అగుము - అగుమా
నిన్నే నెన్నేనని నే
నెన్నైనను నెన్నునిన్నని నేనా
ని న్నాన నూన నేనిన్
నన్నానును నాననాను నననీనన్నా
(మధురవాణీవిలాసము2-11)
మామామోమౌ మామా
మామా మిమ్మోమ్మో మామ మామామేమా
మేమోమమ్మోము మిమైమే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా
మా - చంద్రుని
మా - శోభ
మోమౌ - ముఖముగల
మామా - మాయొక్క
మా - మేథ
మిమ్ము, ఒమ్ము - అనుకూలించును
మామ మామా - మామకు మామా
ఆము - గర్వమును
ఏమి + ఒమ్మము - ఏమి ఒప్పుకోము
మిమై - మీశరీరము
మేము ఏమే - మేము మేమే
మమ్ము ఓముము + ఓముము - కాపాడుము, కాపాడుము
ఇమ్ము - ఔము - అనుకూలమగుమా
చంద్రుని వంటి ముఖముగల దేవా!
మాబుద్ధి మీకు అనుకూలించును.
గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము.
సశరీరివై మాకు అనుకూలంగా ఉండి
మమ్ముకాపాడుము - అని అర్థం.
శతకంలో ఏకాక్షరి కందపద్యం-
ఋత తిత ఊత్తు త్తీతా
తతేతి తాతేత తాత తత్తై తత్తా
తత తుత్తా తతి తుత్తిన్
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్
(సత్యవ్రతి శతకము)
ఉపయోగించి కూర్చబడినది.
మరియు ఇందులో నాలుగవ పాదము
అన్ని పద్యములకు
మకుటంగా ఉన్నందున
అది ఒకే వ్యంజనము
ఉండనవసరములేదు.
ఋత - సత్యమనెడు, తితఉ - జల్లెడచేతను,
ఇత - పొందబడిన, ఆతత - విస్తారియగు,
ఇతి - జ్ఞానము చేతను, తాత - తండ్రివంటి
పరమేశ్వరుని యొక్క, ఇత - పొందబడిన,
తాత - దయచేతను, తత్తైతత్తా - అది ఇది
అనే భేదభావముచేత కలిగిన, తత - అధికమగు,
తుత్తాతతి - బాధ సమూహమును,
తుత్తిన్ - కొట్టుటచేతను,
సత్యవ్రతికి సంతసమొసగును.
పదార్థశోధనముచే గలిగిన జ్ఞానముచేతను,
ఈశ్వరజ్ఞానము చేతను, సంసార దుఃఖము
తొలగుననియు అందుకు సత్యము మూలమని
తాత్పర్యము.
నానాన్నని నిన్నునెన్ననా నేనన్నా
నేనాననూని నేనీ
వానిని కురుమూర్తి శ్రీనివాస మహాత్మా
((వైద్యం వేంకటేశ్వరాచార్యుల శ్రీనివాస శతకంలోనిది-94)
No comments:
Post a Comment