Wednesday, October 25, 2017

బోయీ భీమన్న


బోయీ భీమన్న




సాహితీమిత్రులారా!

-గులాబీ వర్ణన-
ఆంధ్ర కవితాకుమారికి ఊరూరా జరిగిన ఊరేగింపులో యథాశక్తి
పల్లకీ మోసిన బోయీ భీమన్న గారు. వీరి గుడిసెలు కాలిపోతున్నై
కవితా సంపుటికి అకాడమీ బహుమతి లభించింది.
వీరు గులాబీ వర్ణన చేస్తే ఇలా గుంటిందని చెప్పుకోవడమే ఇది.

గులాబీలు పూస్తున్నై
ఒహో పూస్తున్నై

ఎవరికోసమో పాపం
కలవారికే అయివుంటై
రోజాలు రాజాలకు కాక
మరెవరి కోసం

ఒకసారి కోసిన గులాబీలు
మరి మళ్ళీ కోయడానికి
ఎక్కడనుంచి వస్తుంటై

       అవును నిజమే
       ఎక్కడ నుంచి వస్తుంటై

అదే మన సృష్టిలోని రహస్యం
వున్నవారి వినోదార్థం
ఈ గులాబీలు
మళ్ళీమళ్ళీ అవతరిస్తుంటై
పోతుంటో పుట్టుకొస్తుంటై

       ఈ విషవలయం సాగడం
       ఎంతవరకు
       ఆ మొక్కను వేళ్ళతో సహా
       పెకిలించేంతవరకు

(శ్రీరమణ పేరడీలు నుండి...........)

No comments: