Friday, October 13, 2017

కావ్య మాహు రమృత ప్రతిమం కిమ్?


కావ్య మాహు రమృత ప్రతిమం కిమ్?




సాహితీమిత్రులారా!


వర్థమానాక్షరమ్ అనే రకానికి చెందిన
ప్రశ్నోత్తరచిత్రం ఇది
గమనించండి

విద్య యాస్తి సహకో2త్ర విరోధీ?
కా మువే రపి మనొ మదయంతీ?
రావణ శ్చ భృశ మీర్ష్యతి కస్మై?
కావ్య మాహు రమృత ప్రతిమం కిమ్?

ఇందులో నాలుగు ప్రశ్నలున్నాయి
కాని జవాబులు ఇక్కడ లేవు
అందుకే దీన్ని బహిర్లాపిక అనే ప్రహేలికకు
చెందినదిగా కూడ చెప్పవచ్చు.

1. విద్య యాస్తి సహకో2త్ర విరోధీ?
    విద్యకు విరుద్ధమైనదేది?
    - రాః (ధనం లేక ద్రవ్యం)
      సరస్వతి ఉన్నచోట లక్ష్మి ఉండదు.

2.  కా మువే రపి మనొ మదయంతీ?
     మహర్షుల మనస్సున కూడ మత్తు, ముత్తు(సంతోషము)ను  
      పుట్టించునది ఏది?
    - రామా (అందగత్తె)
     సున్దరీ, రమణీ, రామా అని అమరకోశం

3. రావణ శ్చ భృశ మీర్ష్యతి కస్మై?
    రావణుడు ఎవరిపై ఎక్కువ ఈర్ష్య కలిగి ఉండును?
   - రామాయ (రామునికొఱకు లేక రామునిపై)

4. కావ్య మాహు రమృత ప్రతిమం కిమ్?
     అమృత తుల్యమైన కావ్యం ఏది
       - రామాయణం
     వాల్మీకి కృత రామాయణం
     అది అమృత సమానమైన కావ్యం అని భావం

దీనిలో మొదటి ప్రశ్నకు సమాధానం - రాః
      రెండవ ప్రశ్నకు సమాధానం  - రామా
      మూడవ ప్రశ్నకు సమాధానం -రామాయ
      నాలుగవ ప్రశ్నకు సమాధానం - రామాయణం
దీనిలోని సమాధానాలు గమనించినట్లయితే
ప్రతి దానిలో అక్షరాలు పేరుగుతూ వచ్చాయి
అందువల్ల దీన్ని వర్ధమానాక్షరమ్ అని గమనించగలం.

No comments: