Saturday, October 21, 2017

ప్రేమ - లేఖై పారిపోయింది


ప్రేమ - లేఖై పారిపోయింది




సాహితీమిత్రులారా!


శేషేంద్ర శర్మ గారిది తెలుగులో కొత్తబాణి. ఆయనదొక ప్రత్యేకవాణి.
వారు రాసే లేఖ వచనకవితలాంటి గద్యంలో సాగితే యిలా వుండవచ్చు.............

       కాదంబరీ!
       నాటి ప్రత్యూషంలో క్షణక్షణమూ నీవే అయి పరిస్పందిస్తున్నప్పుడు - నా హృదయ కుహరంలో లార్క్ పాడిన పాటను మొహమల్ తివాచిగా పరిచాను నీకోసం.
       నీ రూపం సోకి నా మనసు ముక్కలై వడగళ్ళను వర్షిస్తోంది. ఉద్యానంలో రాలిపోతున్న లిల్లీలు నా గుండెలోకి జారిపడే పిడుగులు
గుప్పెడు గుల్ మొహర్ లు నీడలు నా తాపాన్ని చల్లార్చలేక ఆవిరులై దిగంతాలకు పారి పోతున్నాయ్-
       చిట్టిపోయిన ఊహల్లోంచి స్రవిస్తున్న అశ్రువులు చెంపల్ని జలపాతాలు చేసి, పాదపీఠాన్ని నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నాయి - కోమల విషాదాన్ని భరిస్తూ, నీ సౌమ్యశాసనం కోసం బానిసనై నిలబడ్డాను.....
       సాగరగర్భంలోంచి చీల్చుకు వస్తున్న ప్రతి కెరటపులయలోనూ నీ రూపాన్ని దర్శిస్తున్నా - విచ్చుకుంటున్న ప్రతి పువ్వు చేసే రెక్కల సవ్వడిలోనూ ఆ సీమ చైతన్యమూర్తిని వీక్షిస్తున్నా-
       వేకువలో నీ లావణ్యాన్ని పాటలలోకి తర్జుమాచేసి నా కళ్లకు విన్పిస్తుంది. చిన్న పక్షి ఘోషించే కోటి జలపాతాలను భరిస్తున్న నన్నాపాట సముచ్ఛకితుణ్ణి చేస్తుంది. నీ పదధ్యనుల్ని దోసిళ్ళలో గ్రోలి, నీ దరహాసాలను చూపుల చెమ్కీదారాలతో దండలల్లి హృదయ దవాక్షానికి తోరణం కట్టాలని వుంది-
      కాదంబరీ నీ రాక ఎప్పుడో నీకోసం నిరీక్షిస్తూనే వుంటా - మృత్యువుతో కబురంపినా చాలు.......

(లేఖ చదివాక మనసు దూదిపింజలై తేలిపోతుంది - జవాబు మాట యెలా వున్నా)

(శ్రీరమణ పేరడీలు నుండి...........)
       

1 comment:

Anonymous said...

సహస్రాబ్ది దార్శనిక కవి
కవిర్విశ్వో మహాతేజా
గుంటూరు శేషేంద్ర శర్మ
Visionary Poet of the Millennium
http://seshendrasharma.weebly.com/

జననం 1927 అక్టోబరు 20 నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

మరణం 2007 మే 30 (వయసు 79) హైదరాబాదు

తండ్రి సుబ్రహ్మణ్య శర్మ ( 15 -05 – 1896 -27-07-1966)
తల్లి అమ్మాయమ్మ ( DOB - 19 – 02 – 1980 )
భార్య / వివాహం : 26 -03 – 1945
జానకి

పిల్లలు

విద్యాభ్యాసం

ఉద్యోగం:
వసుంధర; రేవతి (కూతుర్లు);
వనమాలి; సాత్యకి (కొడుకులు)
బి.ఏ (ఏ.సి. కాలేజ్ , గుంటూరు ,)
లా (బి .ఎల్ , మద్రాస్ లా కాలేజ్ , మ మద్రాస్ స్ )
డిప్యూటీ మునిసిపల్ కమిషనర్
(మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ (37 సంవత్సరాలు)




ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ……….
– ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)

* * *

పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
యువ నుంచి యువ దాకా కవితా సంకలనం)
అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999

------------
ఆంధ్ర భువిని అత్యున్నతంబైనయట్టి
శిఖరముల నిల్చి ఇరువు రర్చింపబడెడి _
ఏడు కొండలన్ " శ్రీవేంకటేశు " డొకడు !
సాహితీ గిరిన్ " శేషేంద్ర శర్మ " యొకడు !!
- డా.ఆచార్య ఫణీంద్ర
-------------
కత్తులుగా మొలిచిన శేషేంద్ర మాటలు మానవత్వం పరిమళించే తోటలై,
యువశక్తిని నవయుగం వైపుకు నడిపించే బాటలై,
సారస్వత విలువలను సంరక్షించే దుర్భేద్యమైన కోటలై
ఈ శతాబ్ది చైతన్య స్రవంతిలో అంతర్లీనమయ్యాయి.
ఇదీ శేషేంద్ర సంకల్పం.
ఇదీ శేషేంద్ర స్వామ్యవాద సాహిత్య శిల్పం………”
-----
అక్టోబర్ తర్వాత విప్లవంతో పెనవేసుకున్న మరో నెల మే . అదే మే డే ! కాకతాళీయంగా శేషేంద్ర నిర్యాణం మే నెలలోనే.
అలా జనన మరణాలను అనూహ్యంగా
విప్లవంతో అనుసంధానం చేసుకున్న కాలజ్ఞులు శేషేంద్ర..
- -- డా.వెనిగళ్ళ రాంబాబు
- సినీ గీత రచయిత
-
-------------
అధునిక వాగనుశాసనుడు శేషేంద్ర
“గుంటూరు శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలు (1975) ఆధునిక ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్యక్తిలో, ఆలంకారికతలో, వస్తు విన్యాసంలో కవి తనదైన వ్యక్తిత్వాన్ని ముద్రించుకున్నాడు. విప్ణవభాషా విధాతగా పేరుగన్నాడు. ఈయన కవిసేన మేనిఫెస్టో (1977) పేరుతో ఆధునిక కావ్యశా!స్తాన్ని కూడా రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్గో వచన కవితా ప్రక్రియలో కావ్యాలనేకంగా రచిస్తూ సమకాలిక కవితారంగంలో శిఖరాయమానంగా వెలుగుతున్నాడు. కొంగ్రొత్త (ప్రయోగాలతో కావ్యభాషా స్వరూపంలో మార్చుతెస్తున్న ఆధునిక వాగనుశాసనుడు శేషేంద్ర.”
ఆచార్య పేర్వారం జగన్నాథం
సంపాదకుడు
అభ్యుదయ కవిత్వ్యానంతర ధోరణులు,
(ప్రచురణ 1987)
మాజీ వైస్ ఛాన్సలర్,
తెలుగు యూనివర్సిటీ)
Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com