ఐదక్షరాల పద్యం
సాహితీమిత్రులారా!
ఇక్కడ మనం కేవలం 5 హల్లులతో కూర్చబడిన పద్యం
మన తెలుగు కవులు నంది మల్లయ- ఘంట సింగయ.
వీరే మన తెలుగులో మొదటి జంటకవులు వీరు వ్రాసిన
వరాహపురాణంలో కూర్చిన పద్యం చూడండి-
పంచాక్షరి-
నమశ్శివాయ పంచాక్షరీ సీసము
ఇందులో న-మ-శ-వ-య - అనే
హల్లులను ఉపయోగించి కూర్చబడినది.
యమ నియమాయామ శమనివేశన మనో
మౌనివశ్యాయ నమశ్శివాయ
యానాయమాన నానా యన నవనవా
మ్నాయమ యామ నమశ్శివాయ
వనయోని యామినీ వమేశ శశ్యంశు
మన్నయనాయ నమశ్శివాయ
వ్యోమానుయాయి మా యామానవాశన
మాననాశాయ నమశ్శివాయ
యని వినయమున ముని యనయమును విశ్వ
మను వనమ్మున నెమ్మినై నున్న నన్ను
నెమ్మనమ్మున నమ్మిన నెమ్మినేను
నోము నీశాన యిమ్మన్నదేమి యనిన
(వరాహపురాణము - 10 - 56)
దీనిలో గీతపద్యం చివరిపాదంలో (దే) అన్నది తప్ప
మిగిలిన పద్యమంతా పంచాక్షరాలతోటే సాగింది.
మీరును గమనించండి.
No comments:
Post a Comment