Sunday, October 25, 2020

చెక్కులు పసగలిగుండును

 చెక్కులు పసగలిగుండును




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూడండి-


చెక్కులు పసగలిగుండును

చక్కని గుబ్బలనెసంగ సౌరై యుండున్

చిక్కునొక గడియలోపల

మక్కువసతిగాదు చూడ మహిమండలిలోన్


చెక్కులు (చెంపలు) పసగలిగి ఉంటాయట

గుబ్బలు(పాలిండ్లు) అతిశయించి అందంగా ఉంటాయట

అలాంటిది ఒక గడియకు చిక్కుతుందట

కాని అది సతి(స్త్రీ) కాదట - అదేమిటో చెప్పాలి


సమాధానం - జోడు తలుపులు


తలుపు చెక్కులుంటాయి. గబ్బలుంటాయి

రెండు తలుపులు ఒక గడియకు మాత్రమే చిక్కుతాయి

కాబట్టి సమాధానం సైరైందే.

No comments: