Sunday, October 18, 2020

రెండు దీర్ఘాచ్చుల పద్యం

 రెండు దీర్ఘాచ్చుల పద్యం




సాహితీమిత్రులారా!



రెండు దీర్ఘాచ్చులతోటి కూర్చబడిన పద్యం

లేక శ్లోకంను దీర్ఘ ద్వి స్వరచిత్రం అంటాము.


శ్రీ దీప్తీ హ్రీ కీర్తీ ధీనీతీ గీ ప్రీతీ

ఏధేతే ద్వే ద్వే తేయే నేమే దేవేశే

                            (కావ్యాదర్శము- 3- 86)


(దేవేంద్రుని యందుకూడ లేని శోభాదీప్తులు,

లజ్జాకీర్తులు, బుద్ధినీతులు, వాక్ప్రేమలు

రెండు రెండు నీకు వృద్ధినొందుచున్నవి.)


దీనిలో మొదటి అర్థము అనగా శ్లోకము పూర్వభాగము అంతా - స్వరంతోను,

రెండవ భాగము అనగా ఉత్తరార్థశ్లోకం అంతా - స్వరం తోను కూర్చబడినది.

ఈ రెండును దీర్ఘ స్వరములే

కావున

ఇది దీర్ఘ ద్వి స్వరచిత్రం.


No comments: