Tuesday, October 20, 2020

కందగర్భమణిగణనికరము

 కందగర్భమణిగణనికరము




సాహితీమిత్రులారా!



ఒక ఛందస్సులో మరో ఛందస్సును ఇమిడ్చడం గర్భకవిత్వం

ఇక్కడ మణిగణనికరంలో కందపద్యం ఇమిడ్చడం

కందగర్భమణిగణనికరం దీనికి ఉదాహరణగా

నంది మల్లయ - ఘంట సింగయ

జంటకవులు వ్రాసిన ప్రబోధ చంద్రోదయము

((5-56) పద్యం చూస్తున్నాం-


ఇందులోని ఛందము-

ప్రతిపాదమునకు 4 నగణములు ఒక సగణము

యతి 9 వ అక్షరము


కలికి యొకతె యలక ములలి బలమున్

బలె నలిక తలము పయిఁగడలుకొనన్

గలకల నగియెడు కనుగవతళుకుల్

తళతళ మెఱయఁగఁదను బలుకుటయున్


ఈ పద్యంలో కందపద్యం ఇమిడి ఉన్నది

ఆ కందపద్యము -


కలికి యొకతె యలక ములలి 

బలమున్ బలె నలిక తలము పయిఁగడలుకొనన్

గలకల నగియెడు కనుగవ

తళుకుల్ తళతళ మెఱయఁగఁదను బలుకుటయున్


ఇలాంటి కందగర్భమణిగణనికరములు

కొన్ని మీరు గమనించిచూచుటకు-


బిజ్జల తిమ్మభూపాలుని అనర్ఘరాఘవములోనిది-

భవహర శ్రితజన భవహర, రవి తా

ర వర శిఖినయన రజతధరణి భృ

ద్భవన భువననుత పరిహృత, సవనా

జవనతురగితవిశదవృష సగణా

                                                                                 (2-412)

పుష్పగిరి తిమ్మన గారి

సమీరకుమారవిజయములోని పద్యం-

తొగదొర జిగిబిగి దొరసిన సిగయున్

సెగగను కనుఁగొన జెనకిన పగయున్

మగువ సగము గలమయి నిగనిగయున్

నెగడిన నిను మది నిలిపెద నభవా

                                                                                           ((4-79)


కూచిమంచి తిమ్మకవి 

రసికజనమనోరంజనములోనిది-

జయజయ పురహర జయ గిరిశయనా

జయ తలవినిభృత సదమల హరిణా

నయ గుణవిలసిత నయశుభచయదా

జయ మునివర సుతచరణ సరసిజా

                                                                                       (2-55)

పైన నేను చూపిన విధంగా

కందపద్యంలోనికి మార్చి చూడవచ్చు

ప్రయత్నించి గమనించండి.


No comments: