విషమంటే లక్ష్మియా?
సాహితీమిత్రులారా!
ఒక్కొక్కసారి మనకు ఎవరు ప్రశ్నించకపోయినా
మనకుమనమే ప్రశ్నించుకొని సమాధానం చేసుకుంటాం
అలాసమాధానం చెందడాన్ని అపహ్ననం చేయడం అంటారు.
ఈ శ్లోకం చూడండి-
హాలాహలోనైవ విషం రమా
జనాః పరం వ్యత్యయ మత్ర మన్వతే
నిపీయ జాగర్తి సుఖేన తం శివః
స్పృశ న్నిమాం ముహ్యతి నిద్రయా హరిః
పూర్వం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు పుట్టిన ఈ హాలాహలం అను విషం సంగతి తెలియక ప్రజలు దాన్ని ఘోరకాకోల విషమన్నారు . వాస్తవానికి అది నిజం కాదు అసలైన విషం ఏందంటే అది లక్ష్మి(సంపద). ఎందుచేతనంటే దాన్ని త్రాగిన శివుడు ఏ ఇబ్బందీ లేకుండా చావకుండా హాయిగా, సుఖంగా మేలుకొనే ఉన్నాడు. కాని సముద్రంలో పుట్టిన అసలు విషమైన ఈ లక్ష్మిని(సంపదను) తాకినంత మాత్రాన్నే తన్మయం చెందిన విష్ణువు మాత్రం మూర్ఛితుడైనట్లు నిద్రాముద్రితుడై ఉన్నాడు కదా కనుక అసలు విషమంటే లక్ష్మి(సంపద)యే అని భావం.
ఇందులో ప్రశ్న ఎవరు వేశారు ఎవరూ వేయలేదు అనే ప్రశ్నించుకున్నాడు తనే సమాధానం చెప్పుకున్నాడు
దీన్నే అపహ్ననం చేయడం అంటారు.
ఇదొక సంవాద చిత్రం.
No comments:
Post a Comment