Thursday, August 20, 2020

కందగర్భ చంపకమాల

కందగర్భ చంపకమాల


సాహితీమిత్రులారా!


ఒక పద్యంలో మరోపద్యం ఇమడ్చడాన్ని గర్భకవిత్వం అంటారు.

కవి శక్తినిబట్టి రెండు మూడు అంతకుమించీ పద్యాలను 

ఒకేపద్యం ఇమడ్చడం చేసి ఉన్నారు.

ఇక్కడ మనం మచ్చ వెంకటకవి కృత కుశ చరిత్ర అనే 

అచ్చతెలుగు కావ్యం నుండి ఒక ఉదాహరణ చూద్దాం-

ఇక్కడ మరో విశేషం కూడా గమనించాలి అదేమిటంటే

కుశచరిత్ర పూర్తిగా అచ్చతెలుగులో వ్రాయబడిన కావ్యం.

దీనికి  పెట్టిన పేరు  శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన కుశచరిత్రం


అల సిరినేల నీలల హొయ,ల్గురి యంగడు గూడు ఱేఁడగో
టల ర జగా లనన్నిఁటిని నాడఁగ జేసెడు గారడీఁ డ ని
చ్చలు సరిలేనిఁ క్రొన్నెనరుజ, క్కరహిం గనులందు హెచ్చుఁ గాఁ
గల యతఁడా యనింగడిఁదిఁ గ్రాలిన సోఁకులఁ గూల్చురా యడా!

                                                        (కుశచరిత్రము - 2 - 130)

ఇందులో మనకు చంపకమాల మాత్రం కనిపిస్తున్నది

దీనిలో కందము-  ఇమిడి ఉన్నది

వాటిని గమనిద్దాం-

అల (సిరినేల నీలల హొయ,ల్గురి యంగడు గూడు ఱేఁడగో

టల ర జగా) లనన్నిఁటిని నాడఁగ జేసెడు గారడీఁ డ ని

చ్చలు (సరిలేనిఁ క్రొన్నెనరుజ, క్కరహిం గనులందు హెచ్చుఁగాఁ

గల యతఁడా) యనింగడిఁదిఁ గ్రాలిన సోఁకులఁ గూల్చురాయడా!


విడిగా కందం వ్రాస్తే-

సిరినేల నీలల హొయ,

ల్గురి యంగడు గూడు ఱేఁడగోటల ర జగా

సరిలేనిఁ క్రొన్నెనరుజ 

క్కరహిం గనులందు హెచ్చుఁగాఁగల యతఁడా

ఇదీ కవి ప్రతిభ


No comments: