అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు(దత్తపది)
సాహితీమిత్రులారా!
కుమ్మరి మొల్ల సినిమాలో మొల్లను పరీక్షించటానికి
తెనాలిరామకృష్ణుడు ఇచ్చిన దత్తపది -
అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు
దీన్ని తెరవెనుక పూరించి ఇచ్చింది శ్రీశ్రీగారు
అప్పుడు మిధిలకు జని నే
నిప్పుడు కాంచు వింత నిచ్చటి ప్రజ తా
మెప్పుడును కాంచబోరని
చెప్పుచు రాఘవుడు విరిచె శివకార్ముకమున్
--------------------------------------
ఇంతవరకే సినిమాలో ఉన్నది
కానీ వారు ఇంకా వ్రాసుకొని ఉన్నారట స్క్రిప్టు ఇలా.........
చాలతేలికగా కందం చెప్పావు
ఇదే అర్థం భావం చెడకుండా ఉత్పలమాలలో చెప్పు అమ్మాయీ
అని తెనాలిరామకృష్ణుడు అడగ్గా మొల్ల(శ్రీశ్రీ) ఈ విధంగా
ఇచ్చిదట
అప్పుడు ఖ్యాతిగన్న మిథిలాఖ్యపురంబును చేరనేగి, నే
నిప్పుడు చేయు వింత నెవరేనియు జీవితకాలమందు తా
మెప్పుడుగాని చూడరని యెంతయు సంతసమార, ధీరుడై
చెప్పుచు రాఘవుండు విరిచెన్ శివకార్ముక మద్భుతంబు
గాన్
No comments:
Post a Comment